ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేసాడు.. స్టైలిష్ లుక్ లో పవర్ స్టార్.. వీడియో వైరల్!

పవర్ స్టార్ ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు పూర్తి చేయకుండానే వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.

సినిమాలు అయితే ప్రకటిస్తున్నాడు కానీ వాటిని పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు.

అందుకే ఫ్యాన్స్ మాత్రం ఒక్క సినిమా అయిన పూర్తి చేయమని ఆయనను కోరుతున్నారు.వీరమల్లు సినిమా షూట్ రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేసిన ఇప్పటికి పూర్తి చేయలేదు.

ఇది పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలను అధికారికంగా ప్రకటించాడు.మరి పవన్ ప్రకటించిన సినిమాల్లో సాహో డైరెక్టర్ సుజీత్ కూడా ఉన్నాడు.

సుజీత్ ప్రభాస్ తో సాహో సినిమా తీసిన విషయం తెలిసిందే.భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ సుజీత్ కు ఉన్న టాలెంట్ కు చాలా మంది ఫిదా అయ్యారు.

Advertisement

మరి యంగ్ టాలెంట్ కు పవర్ స్టార్ కూడా మరో అవకాశం ఇచ్చాడు.పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సుజీత్ ఎలా ఉపయోగించు కుంటాడో వేచి చూడాలి.ఇదిలా ఉండగా ఈ రోజు సుజీత్-పవన్ సినిమా లాంఛనంగా స్టార్ట్ చేసారు.

హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో మేకర్స్ ఈ సినిమాను స్టార్ట్ చేసారు. పవర్ స్టార్ స్టైలిష్ లుక్ లో ఈ వేడుకకు హాజరయ్యారు.

ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేసాడు అంటూ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఒక వీడియోను పోస్ట్ చేసారు.ఈ వీడియో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ అయ్యింది. డివివి దానయ్య తన హోమ్ బ్యానర్ డివివి ఎంటర్టైన్ మెంట్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు