మైత్రి వారికి, దిల్‌ రాజుకు ఎక్కడ చెడింది.. సంక్రాంతి సినిమాల పరిస్థితి ఏంటీ?

ఈ సంక్రాంతి సీజన్ కారణంగా ఇండస్ట్రీలో ఎవరి స్థాయి ఏంటీ అనేది క్లారిటీ వచ్చేసింది.

థియేటర్ల విషయంలో దిల్ రాజు మాటే వేదం అన్నట్లుగా ఉంటుంది అంటూ చాలా కాలంగా మీడియాలో ప్రచారం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ థియేటర్లు ఆయన ఆధీనంలో ఉంటాయి.ఆయన ఏ సినిమాకు ఇవ్వాలి అంటే ఆ సినిమాకు మాత్రమే థియేటర్లు దక్కుతాయి.

చిన్న సినిమాలకు ఆయన అన్యాయం చేస్తున్నాడు అంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది.దాన్ని కొందరు నిజం కాదేమో అనుకున్నారు.

కానీ తాజాగా సంక్రాంతి సీజన్ లో తన వారసుడు సినిమాకు చిరంజీవి మరియు బాలకృష్ణల యొక్క సినిమాల కంటే కూడా అధికంగా థియేటర్లు కేటాయించడం తో దిల్ రాజు థియేటర్ల విషయంలో ఏ స్థాయి స్టామినా కలిగి ఉన్నాడో అర్థం అయ్యింది.ఆయన యొక్క సత్తా తో చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలకు కూడా సరైన థియేటర్లు లభించడం లేదు.

Advertisement

ఆ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.వారితో దిల్‌ రాజుకు ఉన్న విభేదాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారితో చాలా కాలంగా సన్నిహితంగానే ఉన్న దిల్‌ రాజు ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉన్నాడు.అందుకు కారణం ఏంటీ అనేది తెలియరాలేదు కానీ ఆ కారణంగానే మైత్రి మూవీ మేకర్స్ వారికి థియేటర్లు కేటాయించే విషయంలో దిల్ రాజు కఠినంగా వ్యవహరిస్తున్నాడు అంటున్నారు.ఇక దిల్‌ రాజు కి పోటీగా మైత్రి మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఏర్పాటు చేశారు అనే ఉద్దేశ్యంతో కూడా దిల్‌ రాజుకు వారి పై కోపం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

మొత్తానికి వారిద్దరి మధ్య పోటీ కారణంగా ఈ సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement
" autoplay>

తాజా వార్తలు