వైసీపీ నిర్వహిస్తోన్న జయహో బీసీ మహాసభకు సర్వం సిద్ధమైంది.ఈ క్రమంలో విజయవాడ అంతా బీసీ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో నిండిపోయింది.
బందర్ రోడ్డు, ఇందిరాగాంధీ స్టేడియం ఇలా ఎక్కడా చూసినా మహాసభ సందడే నెలకొంది.ఈ సభ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనుంది.
వెనుకబడిన కులాల ప్రతినిధులు జయహో బీసీ అంటూ బెజవాడకు వస్తున్నారు.కాగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీ ప్రతినిధులంతా ఈ మహాసభకు హాజరుకానున్నారు.
సుమారు నాలుగేళ్ల వైసీపీ పాలనలో బీసీల కోసం ఏం చేశారో, భవిష్యత్ లో ఏం చేయబోతున్నారనే అంశాలను సీఎం జగన్ ప్రకటించనున్నారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది.
అనంతరం సీఎం జగన్ చేతుల మీదుగా సభను ప్రారంభిస్తారు.నగరంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధింఛారు.
ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.బెంజిసర్కిల్ నుంచి బందరు రోడ్డులోకి, పోలీస్ కంట్రోల్ రూం నుంచి బెంజిసర్కిల్ వైపు, ఐదో నంబర్ రూట్, ఏలూరు రోడ్డులోని సీతారామపురం సిగ్నల్ నుంచి ఆర్‌టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి బందరు రోడ్డుకు జయహో బీసీ మహా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తున్నారు.