కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వారిలో నటి మమత మోహన్ దాస్ ఒకరు.అయితే ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు సింగర్ గా పరిచయమయ్యారు.
ఇలా తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను పాడినటువంటి ఈమెలో ఒక హీరోయిన్ దాగి ఉందని గుర్తించిన జక్కన్న తనకు యమదొంగ సినిమాలో అవకాశం కల్పించారు.ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం క్యాన్సర్ బారినపడి ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కొని నిలబడ్డారు.
ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మమత మోహన్ దాస్ తను అరుంధతి సినిమాని వదిలి పెట్టుకోవడం గురించి పలు విషయాలను తెలియజేశారు.తనకు తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త కావడంతో ఇక్కడ నిర్మాణ సంస్థలు ఎలా ఉంటాయో తనకు తెలియదని తెలిపారు.అయితే అప్పుడే తనకు శ్యాం ప్రసాద్ రెడ్డి అరుంధతి సినిమా అవకాశం కల్పించారు.
అయితే ఆ ప్రొడక్షన్ సంస్థ మంచిది కాదు అని తన మేనేజర్ చెప్పడంతో నేను ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించలేకపోయానని తెలిపారు.

ఇలా ఈ సినిమా కోసం శ్యాంప్రసాద్ రెడ్డి గారు దాదాపు రెండు మూడు నెలల పాటు ఎదురు చూసారు.ఇక ఈ సినిమా నుంచి తాను తప్పుకోవడంతో అనుష్క ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.ఇక ఈ సినిమా వదులుకున్న తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో తాను నటించానని తెలిపారు.
అయితే యమదొంగ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి గారు తనతో మాట్లాడుతూ మీరు అరుంధతి సినిమా వదులుకొని పెద్ద తప్పు చేసారని మాట్లాడారు.ఎంతో గొప్ప డైరెక్టర్ ఇలాంటి మాట అనడంతో ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయింది.
అయితే అప్పటికి ఇంకా అరుంధతి సినిమా విడుదల కాలేదు కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఇలా మమతా మోహన్ దాస్ అరుంధతి సినిమా గురించి రాజమౌళి చెప్పిన మాటల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







