తెలంగాణ ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ను రిలీజ్ చేసింది.
షెడ్యూల్ ప్రకారం మే 29 నుండి జూన్ 1 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.ఈ క్రమంలో ఈనెల 28న నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపారు.
మార్చి 3 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుండగా స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 10 అని వెల్లడించారు.మే 21 నుంచి ఆన్ లైన్ లో ఎంసెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
మే 7, 8, 9 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనుండగా… మే 10, 11న అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.







