గన్నవరం టిడిపి కార్యాలయాన్ని పరిశీలించిన టిడిపి అధినేత చంద్రబాబు

గన్నవరం టిడిపి కార్యాలయాన్ని పరిశీలించిన టిడిపి అధినేత చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ మొన్న నేను గన్నవరం వద్దామనుకుంటే.రానివ్వరా.

 Tdp Chief Chandrababu Inspected The Gannavaram Tdp Office,tdp , Chandrababu , G-TeluguStop.com

గన్నవరం ఏమైనా పాకిస్తానులో ఉందా.సీఐ క్రిస్టియన్ అని ఎఫ్ఐఆర్లో పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారు.

అధికారంలోకి రాగానే తప్పు చేసిన అధికారులు, పోలీసుల మక్కెలిరగ్గొడతాం.పోలీసులు చేసిన సిగ్గుమాలిన పనిని నేను వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా హర్షించరు.

టీడీపీ లేకుంటే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణేదీ.?

కృష్ణా జిల్లాలోనే ఈ విధంగా ఉంటే.పులివెందుల్లో ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి.వంశీ పశువుల డాక్టర్.తనను గెలిపించిన వాళ్లనే కొట్టించాడు.గన్నవరంలో భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు.

ప్రజల్లో భయాన్ని సృష్టించారు.కార్లు, స్కూటర్లు డామేజ్ చేశారు.

పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.పక్కనే ఎయిర్ పోర్టు ఉంది.

హై సెక్యూర్టీ జోన్ లో ఉంది.ఇలాంటి హై సెక్యూర్టీ జోన్ లో విధ్వంసం సృష్టించారు.

ఎందరో మహానుభావులు చరిత్ర సృష్టించిన ప్రాంతం గన్నవరం.అలాంటి గన్నవరంలో రౌడీయిజం చేస్తున్నారు.

పోలీసులతో తప్పుడు పనులు చేయిస్తున్నారు.జగన్ చెప్పినట్టు చేసే పోలీసులు ఇబ్బందులు పడడం ఖాయం.

టీడీపీ కార్యకర్తలు భయపడరు.పోలీసులను పక్కన పెట్టి రండి.

ధైర్యం ఉంటే ముహుర్తం పెట్టండి.అడ్వకేట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

కొందరు బుద్దిలేని పోలీసులు డ్యూటీలో ఉన్న అడ్వకేట్లను అదుపులోకి తీసుకుంటారా.ఏపీని కాపాడుకునేందుకు ఉద్యమించాలి.

ఈ ఉద్యమంలో ఉన్మాదుల పని పట్టాలి.రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో టీడీపీకి ప్రజల సహకారం అవసరం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube