BiggBoss 6 Raj : రాజ్ వెళ్తూ ఇలా షాక్ ఇచ్చాడేంటి..!

బిగ్ బాస్ లో ఏమైనా జరగొచ్చు.అనేది అంత మాట్లాడుకునేది.

కానీ గత సీజన్ నుండి బిగ్ బాస్ ఏంచేయబోతాడో ముందే ప్రేక్షకులు ఊహిస్తున్నారు.

అలాగే జరుగుతుంది.

కానీ నిన్న మాత్రం అందరికి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరు ఊహించని విధంగా రాజ్ ను ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ అభిమానులకు , ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు.

‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’తో ఫైమా సేవ్ అవ్వగా, రాజ్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.ఇక రాజ్ హౌస్ లో నుంచి వెళ్లే క్రమంలో అతను బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ అతనే అంటూ కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు.

Advertisement

రాజ్ హౌస్ లో నుంచి వెళ్లిపోతుంటే మిగతా సభ్యులంతా కన్నీరు పెట్టుకున్నారు.ముఖ్యంగా ఫైమా అయితే మంచి స్నేహితుడు అయినటువంటి రాజ్ ను ఎవిక్షన్ పాస్ ఉపయోగించి ఎలిమినెట్ చేసింది.

ఇది ఆమెను తట్టుకోలేకుండా చేసింది.ఇక బిగ్ బాస్ లో అందరికంటే ప్రత్యేకంగా తనకు రేవంత్ నచ్చాడు అంటూ రాజశేఖర్ తెలియజేశాడు.

అతనితో ప్రతిరోజు మాట్లాడేవాన్ని అంటూ తప్పకుండా మిస్ అవుతాను అని అన్నాడు.

అంతేకాకుండా అతనిది ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అని ఏదైనా జరిగితే అప్పుడే కోపం అప్పుడే జాలి అన్ని చూపిస్తాడు అని తెలిపాడు.నాకు అతనే ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనిపిస్తోంది అని చెప్పి షాక్ ఇచ్చాడు.ఇప్పటికే ఈ సీజన్ విన్నర్ రేవంతే అని అంత ఫిక్స్ అవ్వగా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇప్పుడు రాజ్ కూడా అలాగే చెప్పడం తో ఇప్పటి వరకు కాస్త అటు, ఇటుగా ఉన్న వారు కూడా రేవంతే అని ఫిక్స్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు