Kadapa Reddys Leaders: ఏపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో నలుగురు కడప రెడ్డిలు!

ఆంధ్రప్రదేశ్ తదుపరి ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి నియామకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధృవీకరించారు.ఈ అపాయింట్‌మెంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో నలుగురు కడప రెడ్డిలు కీలక పదువుల్లో ఉండనున్నారు.

 Four Kadapa Reddys Running The Show In Andhra Pradesh Details, Venugopala Krishn-TeluguStop.com

వారిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులకు చెందిన వారు కాగా రాష్ట్రంలో పోలీసు శాఖకు నేతృత్వం వహిస్తున్న డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అదే జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందినవారు.ప్ర‌భుత్వ ప్ర‌తి నిర్ణ‌యం వెనుక ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కూడా పులివెందుల‌కు చెందిన వారే.

ఇప్పుడు కొత్తగా నియమితులైన జవహర్ రెడ్డి కూడా అదే జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందినవారు కావడం విశేషం.

జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీ పదవికి ఎంపిక చేసేందుకు జగన్ మరో ముగ్గురు అధికారుల సీనియారిటీని పక్కన పెట్టారు.

ప్రభుత్వాన్ని నడిపే బ్యూరోక్రాట్లకు చీఫ్ సెక్రటరీ అధిపతి.దీంతో ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు కడప రెడ్డిలు షో రన్ చేస్తున్నట్లే.వచ్చే ఏడాదిన్నర పాటు జవహర్ రెడ్డి ఆ స్థానంలో ఉంటారు.అంటే ఎన్నికల సమయంలోనూ ఆయన ఆ స్థానంలోనే ఉంటారు.

తన కొలువులో రెడ్డిలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నరని ఆరోపణలు వచ్చినప్పటికి జగన్ మాత్రం ఆ సామాజిక వర్గానికే ప్రాధన్యం వహిస్తున్నారు.అయితే బీసీలను అధికార పార్టీకి అనుకూలంగా మలచుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలకమైన సమావేశాన్ని తలపెట్టారు.

Telugu Bcaathmeeya, Dgprajendranath, Ysrc Class-Political

దీనిపై వైఎస్‌ఆర్‌సీ మంత్రులు, బీసీ నేతలు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.డిసెంబర్ 8న జరిగే ఈ సమావేశానికి అన్ని బీసీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తదితరులు హాజరు కానున్నారు.వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకముందే జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేసిందన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube