సినీ హీరో నాగశౌర్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.సినిమా షూటింగ్ లో నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం.
వెంటనే గమనించిన చిత్ర బృందం నాగశౌర్యను ఏఐజీకి తరలించారు.ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.
కాగా సినిమా చిత్రీకరణలో భాగంగా నాలుగు రోజుల నుంచి ఫైట్ సీన్స్ చేస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం నాగశౌర్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలో ఆయనను సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.







