మామూలుగా అవమానాలు అనేవి ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటాయి.అవి సామాన్యులకే కాదు పెద్ద పెద్ద రంగాలకు చెందిన వారికి కూడా ఎదురవుతుంటాయి.
ముఖ్యంగా రాజకీయ నాయకులకు, నటీనటులకు బాగా ఎదురవుతూ ఉంటాయి.ఇలా ఒక హోదాలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎదురవుతూ మాత్రం అసలు తట్టుకోలేరు.
పైగా అవి తమ కెరీర్ మీద కూడా దెబ్బ పడతాయి కాబట్టి.వాళ్లు అవమానపరంగా చాలా ఫీల్ అవుతూ ఉంటారు.ఇప్పటికీ చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు ఎన్నోసార్లు అవమానాలకు గురయ్యారు.ఇదిలా ఉంటే తాజాగా ఒక నటి కూడా తనను అవమానించారు కొన్ని విషయాలు బయట పెట్టింది.
ఇంతకూ ఆ నటి ఎవరంటే.
టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన బోల్డ్ నటి జ్యోతి లబలా.
తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఈమె మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ సినిమాలలో కూడా నటించింది.బుల్లితెరలో కూడా ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా ఈమె రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా పాల్గొన్నది.
తొలిసారిగా అందం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి.ఆ తర్వాత హంగామా, పెళ్ళాం ఊరెళితే, ఎవడి గోల వాడిది వంటి పలు సినిమాలలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఆమె వ్యక్తిగత విషయంలో ఎన్నో వార్తలు వినిపించాయి.అంతేకాకుండా డ్రగ్స్ విషయంలో కూడా ఈమె పేరు ఒకప్పుడు సంచలనంగా మారింది.ఇక ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోగా తమకు ఓ కొడుకు ఉన్నాడు.

కొన్నేళ్లకు తన భర్తతో విభేదాలు రావడంతో అతని దగ్గర విడాకులు తీసుకొని తన కొడుకుతో ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటో లను బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.గతం లో ఈమె ఆర్జీవీ తో చేసిన రచ్చ అందరికి తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే.అప్పుడప్పుడు ఈమె ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన వ్యక్తిగతం గురించి బయట పెడుతూ ఉంటుంది.అయితే తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా తన గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది.అంతే కాకుండా గతంలో తనకు అమెరికాలో అందరి ముందు అవమానం జరిగిందని తెలిపింది.

ఇంతకు అసలేం జరిగిందంటే.కమెడియన్ ఏవీఎస్ కు మీకు మధ్య జరిగిన క్లాష్ ఏంటి అంటూ యాంకర్ అడగడంతో.ఒకసారి తాము ఒక షోకు పరంగా అమెరికాకు వెళ్ళినప్పుడు.అక్కడ తమకు హెడ్ గా ఏవీఎస్ ఉన్నాడట.అయితే అక్కడికి వెళ్లిన తర్వాత జ్యోతి కి యాక్టింగ్ రాదు అంటూ. తనను మా టీంలోకి తీసుకొని అని అన్నాడట ఏవీఎస్.
దాంతో ఆమె కూడా తనకు సెట్ కాని దగ్గర దూరంగా ఉండాలని అనుకుందట.అయితే అక్కడ గోపాలకృష్ణ, మురళీమోహన్లు కూడా టీం లీడర్ లాగా ఉన్నారని.అయితే అక్కడ గోపాలకృష్ణకి జరిగిన విషయం చెప్పటంతో.నువ్వు మా టీం లో ఉండు అని అన్నాడట.
కానీ ఆ సమయంలో ఏవీఎస్ అలా అందరి ముందు అనటంతో చాలా అవమానంగా ఫీల్ అయ్యాను అని తెలిపింది జ్యోతి.







