Google Doodle Winner : ఓ చిన్నారి అద్భుత ప్రతిభ... గూగుల్ డూడుల్‌ విన్నర్‌ ఎవరో తెలిసిపోయింది!

గూగుల్ డూడుల్‌ గురించి వినే వుంటారు.గూగుల్‌ వాడేవారికి ఇవి కొత్త కాదు.

 A Child's Amazing Talent Google Doodle Winner Is Known , Google Doodle,viral Lat-TeluguStop.com

గూగుల్ వెబ్ పేజ్ లో రోజుకో డూడుల్ మనల్ని పలకరిస్తూ ఉంటుంది.ఎన్నో ప్రత్యేకతలను కలిగిఉన్న ఈ డూడుల్‌ తయారీలో గూగుల్‌ ప్రతిసంవత్సరం పోటీలు నిర్వహిస్తుంది.

ఈ క్రమంలో చాలామంది చిన్నపిల్లల్ని ఇన్‌స్పైర్‌ చేయడం, కొత్త విషయాన్ని నేర్చుకోవడం వంటివి కార్యక్రమాలను చేపడుతుంది ఈ గూగుల్‌ డూడుల్‌.కాగా నేడు బాలల దినోత్సవం కదా.ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన శ్లోక్‌ ముఖర్జీ అనే విద్యార్థి డూడుల్‌ను ఈ ఏడాది అత్యుత్తమ డూడుల్‌గా గూగుల్‌ సంస్థ ప్రకటించడం విశేషం.

కాగా ఈ సంవత్సరానికి గాను, అత్యుత్తమ గూగుల్ డూడుల్‌ను గూగుల్‌ సంస్థ తాజాగా ప్రకటించింది.

ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీ తయారుచేసిన ‘ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్’ అనే స్ఫూర్తిదాయకమైన డూడుల్‌ను ఇండియా విజేతగా ప్రకటించడం ఇపుడు ప్రత్యేకతను సంతరించుకుంది.డూడుల్ పోటీలో 20 మంది ఫైనలిస్ట్‌లను ఎంపిక చేసిన 2 వారాల తర్వాత అత్యుత్తమ డూడుల్‌ను ప్రకటించింది.5 క్యాటగిరీల్లో ఇష్టమైన డూడుల్‌ను ఎంచుకోవాలంటూ నెటిజెన్లను గూగుల్‌ కోరింది.

Telugu Google Doodle, Latest, Ups-Latest News - Telugu

ఈ పోటీ కోసం ఇండియాలోని 100 ప్రధాన నగరాల నుంచి 1 నుంచి 10 తరగతుల పిల్లల నుంచి పోటీకి 1,15,000 కంటే ఎక్కువ ఎంట్రీలు వచ్చాయని గూగుల్ నేటి ప్రకటనలో తెలిపింది. ‘రాబోయే 25 ఏండ్లలో నా భారతదేశం.’ అనే థీమ్‌పై పోటీ నిర్వహించారు.ఈ పోటీలో జాతీయ విజేతగా నిలిచిన వారికి రూ.5,00,000 కాలేజ్‌ స్కాలర్‌షిప్, రూ.2,00,000 టెక్నాలజీ ప్యాకేజీని అందిస్తున్నట్లు గూగుల్‌ సంస్థ ప్రకటించడం విశేషం అని చెప్పుకోవాలి.దీంతోపాటు ట్రోఫీ ఆఫ్ అచీవ్‌మెంట్, గూగుల్ హార్డ్‌వేర్ డివైస్‌లను బహుమతిగా అందజేయనున్నట్లు ఈ టెక్ దిగ్గజం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube