ఓ చిన్నారి అద్భుత ప్రతిభ… గూగుల్ డూడుల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది!
TeluguStop.com
గూగుల్ డూడుల్ గురించి వినే వుంటారు.గూగుల్ వాడేవారికి ఇవి కొత్త కాదు.
గూగుల్ వెబ్ పేజ్ లో రోజుకో డూడుల్ మనల్ని పలకరిస్తూ ఉంటుంది.ఎన్నో ప్రత్యేకతలను కలిగిఉన్న ఈ డూడుల్ తయారీలో గూగుల్ ప్రతిసంవత్సరం పోటీలు నిర్వహిస్తుంది.
ఈ క్రమంలో చాలామంది చిన్నపిల్లల్ని ఇన్‌స్పైర్ చేయడం, కొత్త విషయాన్ని నేర్చుకోవడం వంటివి కార్యక్రమాలను చేపడుతుంది ఈ గూగుల్ డూడుల్.
కాగా నేడు బాలల దినోత్సవం కదా.ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీ అనే విద్యార్థి డూడుల్‌ను ఈ ఏడాది అత్యుత్తమ డూడుల్‌గా గూగుల్ సంస్థ ప్రకటించడం విశేషం.
కాగా ఈ సంవత్సరానికి గాను, అత్యుత్తమ గూగుల్ డూడుల్‌ను గూగుల్ సంస్థ తాజాగా ప్రకటించింది.
ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీ తయారుచేసిన ‘ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్’ అనే స్ఫూర్తిదాయకమైన డూడుల్‌ను ఇండియా విజేతగా ప్రకటించడం ఇపుడు ప్రత్యేకతను సంతరించుకుంది.
డూడుల్ పోటీలో 20 మంది ఫైనలిస్ట్‌లను ఎంపిక చేసిన 2 వారాల తర్వాత అత్యుత్తమ డూడుల్‌ను ప్రకటించింది.
5 క్యాటగిరీల్లో ఇష్టమైన డూడుల్‌ను ఎంచుకోవాలంటూ నెటిజెన్లను గూగుల్ కోరింది. """/"/
ఈ పోటీ కోసం ఇండియాలోని 100 ప్రధాన నగరాల నుంచి 1 నుంచి 10 తరగతుల పిల్లల నుంచి పోటీకి 1,15,000 కంటే ఎక్కువ ఎంట్రీలు వచ్చాయని గూగుల్ నేటి ప్రకటనలో తెలిపింది.
‘రాబోయే 25 ఏండ్లలో నా భారతదేశం.’ అనే థీమ్‌పై పోటీ నిర్వహించారు.
ఈ పోటీలో జాతీయ విజేతగా నిలిచిన వారికి రూ.5,00,000 కాలేజ్ స్కాలర్‌షిప్, రూ.
2,00,000 టెక్నాలజీ ప్యాకేజీని అందిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించడం విశేషం అని చెప్పుకోవాలి.
దీంతోపాటు ట్రోఫీ ఆఫ్ అచీవ్‌మెంట్, గూగుల్ హార్డ్‌వేర్ డివైస్‌లను బహుమతిగా అందజేయనున్నట్లు ఈ టెక్ దిగ్గజం తెలిపింది.
ఈ ఊరి ప్రజలు పక్షులు, జంతువుల పేర్లనే ఇంటిపేర్లుగా పెట్టుకుంటారని తెలుసా..?