విజయ్ దేవరకొండ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా గుర్తింపు పొందాడు.వరుస ప్లాప్స్ వచ్చినా ఈయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.
అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో రౌడీ కొన్నాళ్ల పాటు సైలెంట్ అయ్యాడు.
మరి ప్లాప్ వచ్చింది అని అక్కడే ఆగిపోతే కష్టం.
కాబట్టి విజయ్ ఆ ప్లాప్ మర్చిపోయి మళ్ళీ కొత్తగా సరికొత్త గేమ్ ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు.లైగర్ ప్లాప్ తో జనగణమన కూడా అటకెక్కింది.దీంతో విజయ్ భారీ ఆశలు పెట్టుకున్న రెండు సినిమాల పరిస్థితి ఇలా అయ్యింది.ఇక ప్రెజెంట్ విజయ్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషి’ సినిమా సెట్స్ మీద ఉంది.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇందులో విజయ్ కు జోడీగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది.సామ్ ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సినిమా కూడా షూట్ ఆగిపోయింది.
దీంతో విజయ్ కొత్త ప్లాన్ చేసున్నాడు.అందుకే సామ్ ఆరోగ్య పరంగా బగఁయ్యి సెట్స్ లోకి అడుగు పెట్టేలోపు గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి.
లైగర్ తర్వాత విజయ్ ఖాళీగా ఉన్న సమయంలో స్క్రిప్ట్స్ వింటూ సమయాన్ని గడిపారని.అందులో కొన్ని ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.తాజా సమాచారం ప్రకారం విజయ్ ఏకంగా ఐదు సినిమాలను లైన్లో పెట్టాడని టాక్.అందులో రెండు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ నుండి వచ్చిన ఆఫర్స్ కూడా ఉన్నాయట.
ఇటీవలే ఒక ప్రాజెక్ట్ కోసం కరణ్ జోహార్ విజయ్ ను సంప్రదించారని ప్రెజెంట్ ఈ సినిమా చర్చల దశలో ఉందని టాక్.ఈ సినిమాను బాలీవుడ్ బడా డైరెక్టర్ తెరకెక్కించే అవకాశం ఉందట.
అలాగే షారుఖ్ కు సంబందించిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్ మెంట్ కూడా విజయ్ ను ఒక సినిమా కోసం సంప్రదించినట్టు టాక్.లైగర్ తో విజయ్ పని అయిపొయింది అని అనుకున్న వారికీ గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడట రౌడీ స్టార్.