పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు కోతి పనులు చేయొద్దని పెద్దలు హెచ్చరిస్తుంటారు.ఇలా అల్లరికి, చిలిపి చేష్టలకు కోతులు బ్రాండ్ అంబాసిడర్లుగా చిత్రీకరించారు.
ఇక నిజంగానే మనం చాలా సందర్భాలలో చూసి ఉంటాం.ఎవరైనా ఆహారం, చిరుతిళ్లు తింటున్న సమయంలో కోతులు చూస్తే ఎత్తుకుపోతాయి.
పలు చోట్ల అమ్మాయిల కళ్లజోళ్లు, టోపీలు ఎత్తుకుపోయి చెట్లు ఎక్కిన వైనాన్ని మనం చూసి ఉంటాం.ఇలాంటివి సినిమాలలోనూ సన్నివేశాలు పెడుతున్నారు.
అయితే నిజజీవితంలోనూ ఇవి జరుగుతాయి.తాజాగా చిప్స్ ప్యాకెట్ తింటున్న ఓ వ్యక్తి పట్ల కోతుల గుంపు అల్లరి చేష్టలతో ఆడుకుంది.
దీనికి సంబంధించిన వీడియో పలువురికి నవ్వులు పూయిస్తోంది.
జంతువులకు సంబంధించిన ఎన్నో నవ్వు పుట్టించే వీడియోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా కోతులకు సంబంధించిన ఎన్నో వీడియోలు పలువరు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.తాజాగా parida20208 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతలో ఓ ఫన్నీ వీడియోను ఇటీవల పోస్ట్ చేశారు.
అందులో ఓ వ్యక్తి చెట్టు కింద సేదదీరుతూ కనిపిస్తాడు.ఇక అతడి చేతిలో బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్ ఉంటుంది.
ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి, ఒక్కోటి తింటూ ఉన్నాడు.చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ, కరకరలాడే చిప్స్ నోటిలో వేసుకుని నములుతున్నాడు.
అయితే అతడిని ఓ కోతుల గుంపు గమనించింది.వెంటనే వచ్చి అతడి చేతిలోని చిప్స్ ప్యాకెట్ లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
చాలా కోతులు అతడిపై దాడి చేస్తాయి.

ఓ కోతి అతడిపై దూకి అతడిని కింద పడేస్తుంది.ఇలా ఆ కోతులు చాలా అల్లరి పనులు చేస్తుంటాయి.కిందపడిన ఆ వ్యక్తి బాధగా చూస్తున్నాడు.
అయితే ఆ కోతులు గుంపు మాత్రం అతడి చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి, అతడి పక్కనే కూర్చుని తింటాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కోతుల గుంపు చేసిన అల్లరి పని చూసి నవ్వుకుంటున్నారు.
ఆ బాధిత వ్యక్తిని చూసి అయ్యో పాపం అనుకుంటున్నారు.







