దీపావళి సర్ప్రైజ్ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన పూర్ణ... ఫోటోలు వైరల్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు తమిళ మలయాళ భాషలలో పలు సినిమాలలో నటించిన పూర్ణ అనంతరం తెలుగు బుల్లితెరపై కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

 Poorna Shares Diwali Surprise Wedding Photos Photos Viral, Poorna , Shares Diwal-TeluguStop.com

ఇకపోతే ఈమె ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాల ద్వార కూడా అభిమానులను సందడి చేశారు.ఇకపోతే పూర్ణ మే నెలలో దుబాయ్ కి చెందిన అసిఫ్ అలీ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే.

ఇలా ఈమె త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తారుని అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా ఈమె మాత్రం తనకు పెళ్లి జరిగింది అంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు.దుబాయిలో తన పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగిందని పూర్ణ వెల్లడించారు.

వీసా సమస్య కారణంగా తన పెళ్లికి ఎవరిని ఆహ్వానించలేదని త్వరలోనే కేరళలో ఎంతో ఘనంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఈమె ప్రకటించారు.ఇలా రహస్యంగా పూర్ణ వివాహం చేసుకోవడంతో అభిమానులందరూ ఒకింత ఆశ్చర్యానికి గురైనప్పటికీ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా పెళ్లి చేసుకున్నానని ప్రకటించిన అనంతరం పూర్ణ దీపావళి పండుగ సందర్భంగా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇలా సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఇక ఈ ఫోటోలలో పూర్ణ ఎంతో సంతోషంగా,ఎంతో అందంగా ముస్తాబై ఉన్నారు.ప్రస్తుతం ఈమె పెళ్లి ఫోటోలు, నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube