ప్రభాస్ నటించిన ఆ సినిమా రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి రికార్డులు బద్దలయ్యేవి: వర్మ

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున వారి సినీ కెరియర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేయడం ట్రెండ్ అవుతుంది.ఇప్పటికే జల్సా, పోకిరి, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు విడుదలయి ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి.

 Baahubalis Records Would Have Been Broken If Prabhas Starrer Had Been Re Release-TeluguStop.com

ఇక అక్టోబర్ 23వ తేదీ ప్రభాస్ పుట్టిన రోజు పండుగను జరుపుకోవడంతో పెద్ద ఎత్తున ఈయన నటించిన బిల్లా వర్షం సినిమాలను విడుదల చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమాల రీ రిలీజ్ విషయంపై కాంట్రవర్సీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు.

ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దివాళి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సినిమాల గురించి కూడా ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా వర్మ స్పందిస్తూ.

ప్రభాస్ నటించిన బిల్లా సినిమా కాకుండా ఆయన నటించిన రాధే శ్యామ్ సినిమాను రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి సినిమా కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టేది అంటూ సెటైరికల్ గా ప్రభాస్ డిజాస్టర్ సినిమా గురించి ప్రస్తావిస్తూ కామెంట్ చేశారు.

Telugu Baahubalis, Pooja Hegdhe, Prabhas, Radhya Shyam, Broken, Varma-Movie

ఇలా ఈ సినిమా గురించి ప్రస్తావించడమే కాకుండా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేయడంతో ఎంతోమంది ప్రభాస్ అభిమానులు వర్మ చేసిన ట్వీట్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.వర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రభాస్ సినిమాపై సెటైర్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే బిల్లా సినిమా విడుదలైన సందర్భంగా అభిమానులు థియేటర్లో టపాసులు పేల్చడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే ఈ విషయంపై వర్మ స్పందిస్తూ పిచ్చి చర్య అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube