Former chief selector made sensational comments on Umran Malik, spots , news, spots , upadte

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ అయినా జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు.

బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను బీసీసీఐ సెలెక్ట్ చేసింది.

ఇంకో టీమిండియా ప్రధాన బౌలర్ షమీకి కరోనా నెగిటివ్ వచ్చిన ఎంపిక చేయకుండా షమీ కి విశ్రాంతినిస్తూ నిర్ణయం తీసుకుందిటి20 ప్రపంచ కప్ కు అందుబాటులో బుమ్రాఉండకపోవచ్చునే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.దీనితో షమీ లేదా దీపక్ చాహర్ లలో ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది.

అయితే ఎవరిని ప్రధాన జట్టులోకి తీసుకుంటారో, ఎవరిని స్టాండ్ పైగా ఎంపిక చేస్తారో చూడాలి.ఈ తరుణంలో టీం ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్, మాజీ కెప్టెన్ అయిన దిలీప్ వెంగ్‌సర్కార్ భిన్నంగా స్పందించాడు.

షమీ, సిరాజ్ కాకుండా ఉమ్రన్ మాలిక్ సెలెక్ట్ చేయాల్సిందిగా చెప్పాడు.యువ బ్యాటర్‌ శుభ్‌మన్ గిల్‌ టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్నాడని వెంగ్‌సర్కార్ తెలిపాడు.

Advertisement

టీమిండియాలో గిల్ ఉంటే బాగుండేదని కూడా ఈ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు.టీమిండియా క్రికెట్ జట్టు సమతూకంగా ఉందని ఏ మార్పు గురించి ఆలోచించకుండా ఉండాలని తెలిపాడు.

బూమ్రా లేకపోతే నేను యువ సంచలన బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను సెలెక్ట్ చేసేవాడిని కూడా తెలిపాడు.ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ వేగమే అతనికి ప్రధాన బలం.150 కి.మీ వేగంతో బంతులను వేసి బ్యాటర్లను ఇబ్బందికి గురి చేసే ఈ బౌలర్ టీం ఇండియాలో ఉంటే బౌలర్ల విభాగం ఇంకా బలంగా ఉంటుందని చెప్పాడు.ఒకవేళ మాలిక్ 130 కి.మీ స్పీడ్ తో బౌలింగ్ చేసేవాడైతే నేను కూడా ఎంపిక చేసే వాడిని కాదు అని ఉమ్రాన్ మాలిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆస్ట్రేలియాలో టీ 20 ప్రపంచ కప్ జరుగుతుండడంతో ఆస్ట్రేలియాలోని పిచ్ లు, ఫేస్, బౌన్స్ కు ఎక్కువగా సహకరించే అవకాశం ఉంది.

అందుకే ఫాస్ట్ బౌలర్ల లు కావాలనేది నా అభిప్రాయం.శ్రేయస్ అయ్యర్ గిల్ మహమ్మద్ షమీ టీం ఇండియా ప్రధాన జట్టులో ఉండి ఉంటే టీమిండియా ఇంకా బలంగా ఉండేదని తెలిపాడు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు