ఐ లవ్ యూ అంటూ అతని ఫోటో షేర్ చేసిన మెగా డాటర్.. ఫోటో వైరల్!

మెగా డాటర్ నిహారిక గురించి మనందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది నిహారిక.

నిహారిక పెళ్లి ముందు ఎలా ఉందో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంది.కాగా నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందె.

ఒకవైపు కెరీర్ పరంగా దూసుకెళ్తూనే మరొకవైపు తన భర్త చైతన్య తో కలిసి టూర్లు తిరుగుతుంటే గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ఇకపోతే నిహారికకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

నిహారిక పెళ్లిలోనే ఆమెకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మనందరికీ తెలిసిపోయింది.కాగా నిహారిక పెళ్లి లో ఆమె ఫ్రెండ్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

Advertisement

నిహారిక తో పాటు కలిసి పని చేసిన దర్శకుడు, చిన్నతనం నుంచి కలిసి పెరిగిన గ్యాంగు, స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ అంటూ ఇలా చాలా మందే ఫ్రెండ్స్ ఉన్నారు.తన బ్యాచిలర్ పార్టీలో వీరంతా కూడా కనిపించారు.

గోవాలో అందరూ కలిసి తెగ ఎంజాయ్ చేశాడు.ఇక్కడ కూడా పార్టీలు చేసుకున్నారు.

ఇక నిహారిక గ్యాంగులో కాళ భైరవ కూడా ఉంటాడు.అయితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కాలభైరవతో నిహారికకు మరింత ప్రత్యేకమైన బంధం ఉన్నట్లు తెలుస్తోంది.

వీరందరు కూడా బాల్య స్నేహితులు అన్న విషయం తెలుస్తోంది.తాజాగా నిహారిక వేసిన పోస్ట్, కాళ భైరవ మీద ప్రేమను కురింపించింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇంతకీ ఆమె వేసిన పోస్ట్‌లో ఏముందంటే.హ్యాపీ బర్త్ డే భైరి బాబు.నువ్ నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసని అనుకుంటున్నాను.

Advertisement

నా అవసరాల్లో నాకు అండగా, నాకు తోడుగా ఉన్నందుకు థాంక్స్.ఈ ప్రపంచంలోని సంతోషమంతా కూడా నీకు దక్కే అర్హత ఉంది.

ఐ లవ్యూ నీ అద్భుతమైన గాత్రంతో ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలి.ఎంతో మంచి సంగీతం అందించాలి అంటూ విషెస్ చెప్పింది నిహారిక.

కాగా తాజాగా విడుదల అయిన సీతారామం సినిమాను చూసిన నిహారిక ఎమోషనల్ అయింది.విజువల్స్, సాంగ్స్, యాక్టింగ్ ఇలా ప్రతీ ఒక్క అంశంలో సీతారామం అద్భుతం అంటూ ఆమె తెగ పొగిడేసింది.

ప్రొడక్షన్ డిజైన్, నిర్మాతలు, దర్శకుడు సినిమాను అద్భుతంగా తీశారని మెచ్చుకుంది.ఈ క్లాసిక్ సినిమాను మిస్ అవ్వొద్దని, చాలా కాలం తరువాత థియేటర్లో చూడాల్సిన చిత్రం వచ్చిందని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు