పుష్ప 2 కంటే ముందుగా పుష్ప రాజ్ ది సోల్జర్ సినిమా విడుదల?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం అందరికీ తెలిసింది.గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనెక్షన్ల సునామీని సృష్టించింది.

ఇకపోతే అల్లు అర్జున్ అభిమానులు పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా పుష్ప 2 సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.

షూటింగ్ మొదలు కావడానికి ఇంకా సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ గ్యాప్ ని ఫుల్ ఫీల్ చేస్తాను అంటూ పుష్ప రాజ్ ది సోల్జర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ధ్రువ సర్జా.

Advertisement

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జ హీరోగా, రచితా రామ్,హరిప్రియ కలిసి నటించిన కన్నడ చిత్రం పుష్ప రాజ్ ది సోల్జర్.ఈ కనడ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాను ఆర్ఎస్ ప్రొడక్షన్స్, గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామ సినిమాస్ బ్యానర్లపై బొడ్డు అశోక్ విడుదల చేయనున్నారు.

ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ సినిమా యాక్షన్ అండ్ లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిందని, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అనే నమ్మకం తనకు ఉంది అని తెలిపారు బొడ్డు అశోక్.తెలుగులో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు పుష్ప రాజ్ ది సోల్జర్ అనే టైటిల్ ప్రకటించిన తర్వాత భారీగా క్రేజ్ వచ్చింది అన్నారు బొడ్డు అశోక్.ఫుడ్డు జరగా తనకు ఈ సినిమాకు మంచి పేరు తీసుకువస్తుంది అని తాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు