కాళేశ్వరం ప్రాజెక్టుకు అంత నష్టం వచ్చిందా?

ఇటీవల గోదావరి వరదల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి.ముఖ్యంగా తెలంగాణలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.

అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా భారీగా నష్టం వాటిల్లింది.కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన పంప్ హౌస్ మొత్తం నీటిలో మునిగిపోయింది.

దీనివల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన పడుతున్నారు.ముఖ్యంగా లక్ష్మీపంప్ హౌస్‌లో 17 మోటార్లున్నాయి.ఇవన్నీ వరద నీటిలో మునిగిపోయాయి.200 అడుగుల పొడవు 35 అడుగుల వెడల్పు, 360 అడుగుల లోతులో కాళేశ్వరం పంప్ హౌస్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.ఇందులో 17 భారీ మోటార్లను బిగించారు.

వరద దెబ్బకు ఇపుడీ పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది.ఇందులోని నీటిని తోడేయాలన్నా కూడా పెద్ద కష్టమే.

Advertisement

నీటిని తోడితే కానీ మోటార్లు బయటపడవు.మోటార్లు బయటపడితే కానీ వాటి పరిస్ధితేంటో తెలియదు.

రక్షణ గోడ శకలాలు, భారీ క్రేన్, ఇనుప గేట్లు మోటార్లపై పడి పూర్తిగా దెబ్బతిన్నాయోమేనని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి వరదల ధాటికి అన్నారం, కన్నెపల్లి పంప్ హౌస్‌లు మునిగిపోవడంతో దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్ల దాకా నష్టం వాటిల్లిందని అనధికార అంచనా.ఇంత జరిగినా అక్కడేం జరగనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉండటం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంగా టీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నష్టంపై ఇప్పటివరకు ప్రభుత్వం నోరు విప్పడం లేదు.వరద ముంచెత్తి 4 రోజులైనా అక్కడేం జరిగింది, ప్రాజెక్టుకు ఏమైంది, ఎంత నష్టం వాటిళ్లింది వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు.కాళేశ్వరం మోటార్లు, పంపులన్నీ మునిగిపోవడంపై ప్రజల్లో చర్చ జరిగితే ఇప్పటివరకు కేసీఆర్ చెప్పుకున్న గొప్పలన్నీ గోదాట్లో కొట్టుకుపోతాయని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.

అందుకే విమర్శల నుంచి తప్పించుకునేందుకు టీఆర్ఎస్ కొత్త వివాదాలు తెరపైకి తెస్తోంది.ఇటీవల క్లౌడ్ బరస్ట్ అని, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు అని రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు టీఆర్ఎస్ పన్నాగాలను బహిరంగంగానే ఎండగడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు