స్పీడు పెంచేసిన బాబు గారు ! ఆ నియోజక వర్గాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటన

టిడిపి అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచేశారు 2024 లో జరగబోయే ఎన్నికలకు ముందు నుంచే సిద్ధమైపోతున్నారు.

ఇప్పటికే జిల్లాల యాత్ర మొదలుపెట్టిన చంద్రబాబు ఈ సందర్భంగా మినీ మహానాడు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

అధికార పార్టీగా ఉన్న వైసీపీని ఢీకొట్టేందుకు అవసరమైన బలాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకుంటుంది.ఇప్పటికే వరుసగా అనేక ప్రజా సమస్యలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానంటూ గతంలోనే ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.కొన్ని కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో, వైసిపి బలంగా ఉన్న చోట్ల ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

గతంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చివరి నిముషంలో అభ్యర్థులను ప్రకటించేవారు.అయితే ఆ విధంగా చేయడం వలన 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంతగానో నష్టపోయింది.

Advertisement

అభ్యర్థులు నియోజకవర్గంలో బలం పెంచుకునేందుకు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సమయం సరిపోకపోవడం, ప్రస్తుతం వైసీపీ ప్రజా సంక్షేమ పథకాల ద్వారా జనాల్లో ఆదరణ పెంచుకోవడం ఇవన్నీ లెక్కలు వేసుకున్న బాబు ఇప్పుడు జిల్లాల పర్యటనలోనే ఆయా జిల్లాలకు సంబంధించి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటి చేస్తున్నారు.తాజాగా కడప టిడిపి ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రకటించారు.

అలాగే రాజంపేట నుంచి గంటా నరహరి పోటీ చేస్తారని ప్రకటించారు.వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉండడం వైసిపికి గట్టిపట్టు ఉండడంతో ముందుగానే ఆర్థికంగా బలంగా ఉన్న నరహరిని బాబు ఎంపిక చేశారు.

ఇక కుప్పం లో తన ఓటమికి కృషి చేస్తూ చిత్తూరు జిల్లా పై పట్టు పెంచుకున్న వైసీపీ మంత్రి, జగన్ కు అత్యంత సన్నిహితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ప్రధాన లక్ష్యంగా బాబు ఉన్నారు.

అందుకే ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా చల్లా బాబు రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు.అయితే ఇదే టికెట్ ను సీనియర్ నేత రమణారెడ్డి ఆశించడంతో.బాబు ప్రకటన వెంటనే అక్కడ సమావేశంలో గందరగోళం నెలకొంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఇక పీలేరులో టిడిపి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించారు.ఇక పులివెందుల నుంచి ఎప్పుడూ పోటీ చేస్తున్న సతీష్ రెడ్డి మళ్ళీ పోటీ చేసేందుకు అంత ఆసక్తిగా లేకపోవడంతో, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవిని అభ్యర్థిగా ఖరారు చేశారు.

Advertisement

ఇప్పటికే కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుటుంబాన్ని పక్కనపెట్టి ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ని ఓడించడమే లక్ష్యంగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు.ఇక ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస నియోజకవర్గం నుంచి మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పేరును గతంలోనే ప్రకటించారు.

అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ని ముమ్మిడివరం నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా దాట్ల బాపిరాజు పేరును ఖరారు చేశారు.ఈ విధంగా బాబు జిల్లాల పర్యటనలోనే అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడు మీద ఉన్నారు.

తాజా వార్తలు