కేసీఆర్ పాన్ ఇండియా పొలిటికల్ సూపర్ స్టార్ అంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం నడుస్తోంది.ఇదే సమయంలో అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

మోదీ గొప్ప అని బీజేపీ నేతలు అంటుంటే.లేదు లేదు కేసీఆరే గొప్ప అని టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

ఈ విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఓ అడుగు ముందుకేసి కేసీఆర్‌ను పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటూ సినిమా డైలాగులు చెప్పడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.సాధారణంగా పాన్ ఇండియా అన్నది ఇటీవల సినిమాల్లో తెగ వాడుతున్నారు.

ఒక హీరోకు సంబంధించిన సినిమా అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధిస్తే సదరు హీరోను పాన్ ఇండియా స్టార్ అని పిలుస్తున్నారు.మరి కేసీఆర్ తెలంగాణ వ్యక్తి అయినప్పుడు ఆయన్ను పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అని ఎలా సంభోదిస్తారంటూ పలువురు జీవన్‌రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

Advertisement

కేసీఆర్ కేవలం తెలంగాణ వరకే పరిమితమయ్యారని.కనీసం పక్క తెలుగు రాష్ట్రంలో కేసీఆర్ పార్టీనే లేదని గుర్తుచేస్తున్నారు.

మరోవైపు సౌత్ ఇండియా జోలికి వస్తే బీజేపీ మౌత్ పగులుతుందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణలోనూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని.

అలాంటప్పుడు బీజేపీని సౌత్‌ ఇండియాకు రావొద్దని టీఆర్ఎస్ నేతలు ఎలా చెప్తారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.అటు తెలంగాణ అభివృద్ధిని చూసి మోదీ సహా బీజేపీ ముఖ్య నేతలు నేర్చుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు.

ఈస్టిండియా కంపెనీ దేశాన్ని దోచుకున్నట్టు మోదీ ఆధ్వర్యంలోని నార్త్‌ ఇండియా కంపెనీ తెలంగాణను దోచుకోవడానికి వచ్చిందని ఆరోపించారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కాగా కేసీఆర్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అనిపించుకోవాలంటే ముందు ఆయన జాతీయ పార్టీ స్థాపించి ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి.ఇప్పటివరకు అలాంటివి జరగలేదు.ఒకవేళ జాతీయ పార్టీ పెట్టినా కేసీఆర్ ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తారు అన్న విషయం ఆసక్తిగా మారింది.

Advertisement

అయితే కేంద్రంలోని బీజేపీకి ఎదురుగా వెళ్లి కేసీఆర్ నిలబడతారా.బొక్కబోర్లా పడతారా అన్నది కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు