ఏపీ పై బీజేపీ ప్రత్యేక దృష్టి ? నేటి నుంచి ఏం చేయబోతోంది అంటే ?

ఏపీ లో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా.

ఆ ఆశ తీరడం లేదు.

దీంతో ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో ఖచ్చితంగా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తోంది.కానీ ఒంటరిగా పోటీ చేసిన ప్రతిసారి ఘోరపరాజయం బిజెపికి ఎదురవుతోంది.

ప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలు ఏపీ లో పొత్తు పెట్టుకున్నాయి 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అధికారంలోకి రావాలని బిజెపి చూస్తోంది.కానీ బీజేపీ కంటే టిడిపి తో కలిసి వెళ్లే విధంగా బీజేపీతో తెగతెంపులు చేసుకునే విధంగా జనసేన వ్యవహరిస్తుండడం బీజేపీ నేతల్లో ఆందోళన పెంచతోంది.

బీజేపీని బలోపేతం చేసి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీపై విమర్శల దాడి మరింతగా పెంచాలని , ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లోని లోపాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది .నేటి నుంచి బిజెపి ఏపీలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.ప్రధాని నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల విజయాలపైన బిజెపి ప్రచారం చేయబోతోంది.

Advertisement

ఈరోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు బిజెపి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించే విధంగా షెడ్యూల్ రూపొందించుకుంది.ఈనెల 16 నుంచి 20 మధ్యలో జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

అలాగే ఈ నెల 21న గ్రామ, మండల స్థాయిలో సేవా సంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని బిజెపి నిర్ణయించుకుంది.

ఈనెల 23న బిజెపి మండల స్థాయి కార్యవర్గ సమావేశం నిర్ణయించాలని, ఆ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.ఏదో రకంగా ప్రజల్లో బీజేపీపై ఇదే విధంగా పట్టు పెంచుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుంది ? ఎన్నికల్లో ప్రజలు ఎంత వరకు బిజెపి పై మొగ్గు చూపుతారు అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు