సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ప్రస్తుతం ‘సర్కారు వారి పాట‘ సినిమా తెరకెక్కిన విషయం విదితమే.ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
మహేష్ బాబు గత సినిమాల కంటే మరింత యంగ్ గా, చార్మింగ్ లుక్ తో అందరిని మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.
ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఒక్కో అప్డేట్ వస్తుంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వస్తున్నాయి.
యాక్షన్, రొమాన్స్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ అందరిని ఆకర్షిస్తుంది.
తొలిసారి కలిసి నటించిన ఈ జోడీ ని చుస్తే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది.ఈమెను ఎప్పుడు చూడని విధంగా పరశురామ్ చూపించినట్టు కూడా తెలుస్తుంది.
ఇప్పటికే టీమ్ అంతా కీర్తి సురేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని ఆమె అద్భుతంగా నటించిందని చెప్పుకొస్తూనే ఉన్నారు.

ఇక ప్రీమియర్స్ పడడానికి కొన్ని గంటల ముందు ఈ సినిమాలో కీర్తి పాత్ర ఎలా ఉంటుందో అనేది బయటకు వచ్చింది.ఈ సినిమాలో ఈమె పాత్ర ఆకతాయిగా ఉంటుందని.ఆమెకు గ్యాంబ్లింగ్ అంటే ఇష్టమని తన పాత్ర ట్విస్ట్ ఇవ్వబోతుంది అని అంటున్నారు.
మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియదు కానీ ఈమె పాత్ర పై మాత్రం ఈ వార్తలు బయటకు వచ్చి నెట్టింట వైరల్ అయ్యాయి.