రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నాయకుల నిరసన ఫలిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నాయకులు నిరసనలు చేపట్టారు.అయితే కేంద్ర ప్రభుత్వం సామన్య ప్రజలపై మరింత పన్ను విధిస్తున్నారు అని నాయకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సీపీఐ నాయకులు ఆందోళనలు వల్ల ఉద్రిక్తతలు జరుగుతున్నాయి.విద్యుత్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ చలో సెక్రటేరియట్ కు సీపీఐ పిలుపు నిచ్చింది.

ఈ నేపథ్యంలో అనంతపురంలో సీపీఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.

దీంతో అనుమతి లేదంటూ రామకృష్ణతో పాటు పలువురు సీపీఎం నాయకులను పోలీసుల అరెస్ట్ చేశారు.దీంతో అనంతపురం పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Advertisement

అయితే సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణను అరెస్ట్ చేసి తొలుత ఓ పోలీస్ స్టేషన్‎కు తరలించారు.ఆ తర్వాత మరో పోలీస్ స్టేషన్ తరలించడంతో సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల తీరును తప్పుబట్టారు.ఈ ఘటనతో అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్‎కు వెళ్లి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిని టీడీపీ నేతలు పరామర్శించారు.

రామకృష్ణను ఎందుకు అరెస్టు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ నియంతలా పాలన సాగిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.పెంచిన ధరలు తగ్గించాలని అనంతపురంలో చేపట్టిన చలో అమరావతి ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి, ప్రదర్శనగా వస్తున్న నాయకులను అరెస్ట్ చేశారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

దీంతో పోలీసులు, ప్రభుత్వ తీరుపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో పోలీసుల పరిపాలన సాగుతోందని మండిపడ్డారు.

Advertisement

ధరలు తగ్గించే వరకు పోరాటాలు చేస్తామన్నారు.ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడానికి ప్రజా సంఘాలు, మేధావులు కలిసి రావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.

తాజా వార్తలు