ఈ ఐడియాకి ఇంజనీర్లు సైతం అవాక్కవ్వాల్సిందే ..!

సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.ఎప్పుడు… ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.

 Man Made Unique Tool For Plucking Fruits With The Help Of Pipe And Bottle Detail-TeluguStop.com

అసలు ఈ వీడియో చూసి ఆ ఆలోచన ఎలా వచ్చిందని కూడా అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది.కొన్ని దేశీ జుగాడ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.

ఇంజనీరింగ్‌ చదివిన విద్యావంతులు.పెద్ద పెద్ద సైంటిస్ట్ లు కూడా ఇలాంటి వీడియోలని చూసి నోరెళ్లబెడుతారు.

తాజాగా ఒక దేశీ జుగాడ్‌ తయారచేసిన పరికరం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి ప్లాస్టిక్ పైపుతో పండ్లు కోస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు.

ప్లాస్టిక్ పైపు, తాడును ఉపయోగించి పండ్లు కోసే ఒక పరికరాన్ని తయారు చేసాడు.బాటిల్‌కి కొన్ని రంధ్రాలు చేసి వాటిలో నుంచి తాడుని ముడివేస్తూ ఉంటాడు.చివరకి పండ్లు కోయడానికి అనువుగా దానిని సిద్దం చేస్తాడు.దీనిని ఉపయోగించి ఏ పండునైనా సరే కిందపడకుండా సులువుగా కోయవచ్చు.

పండ్లు కోసేటప్పుడు బాటిల్‌ తెరుచుకునే పద్దతి చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా, ఈ వీడియోని ఒక నెటిజన్‌ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.ఈ వీడియోకి నెటిజన్లు తమదైన శ్రేణిలో కామెంట్స్ చేస్తున్నారు.వావ్! దేశీ జుగాద్ జిందాబాద్.! అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేస్తుండగా.మరొక నెటిజన్‌ ఈ ఆలోచన ఖచ్చితంగా బాగుంది అని తెలిపాడు.ఇది కాకుండా చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube