పెళ్లి మండపానికి లేట్ గా వచ్చిన వరుడు.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే..!

కొంతకాలంగా పెళ్లిళ్లలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి.అసలు పెళ్లి మండపానికి వరుడు, వధువు చేరుకునేలోపే చాలా జరిగిపోతున్నాయి.

అలాంటి సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది.పార్టీ చేసుకుని పెళ్లి మండపానికి వరుడు ఆలస్యంగా వచ్చాడని తెలిసి అతనితో వివాహానికి నిరాకరించింది పెళ్లి రోజు కూడా తాగకుండా ఉండలేకపోయిన వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోవడానికి భయపడి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

పెళ్లికి వచ్చిన ఓ బంధువును వివాహం చేసుకుంది.దీంతో ఆ వరుడు షాకై ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మల్కాపూర్‌ పాంగ్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది.వివరాల్లోకి వెళ్తే.

Advertisement

బుల్దానా జిల్లాలోని కండారీ గ్రామానికి చెందిన యువకుడితో మల్కాపూర్‌ పాంగ్రా గ్రామానికి చెందిన యువతికి వివాహం కుదిరింది.మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో ఈ నెల 22న ఒక జంటకు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

సాయంత్రం 4 గంటలకు పెళ్లి ముహూర్తం.పెళ్లి మండపానికి అతిథులు చేరుకున్నారు.

కానీ వరుడు మాత్రం ఆ సమయానికి పెళ్లి మండపానికి చేరుకోలేదు.పెళ్లి కుమారుడి కోసం పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, బంధువులు వేచి చూస్తున్నారు.

అయితే వరుడు మాత్రం ఫుల్ గా మద్యం సేవించి బంధువులు, స్నేహితులతో కలిసి డ్యాన్సులు వేశాడు.మధ్యాహ్నానికే మల్కాపూర్‌ పాంగ్రా గ్రామానికి చేరుకున్న వరుడు బారాత్ ముగించుకొని పెళ్లి మండపానికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలయింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ముహూర్తం దాటిన తర్వాత వచ్చిన వరుడి తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అతడిని పెళ్లి చేసుకోనని వధువు తన తండ్రికి తేల్చిచెప్పింది.కూతురు నిర్ణయాన్ని తండ్రి గౌరవించాడు.

Advertisement

వరుడు కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు.వరుడి తరఫు వారు అమ్మాయికి ఇచ్చిన ఆభరణాలు, చీరలు వెనక్కి ఇచ్చేశాడు.

పెళ్లికి వచ్చిన ఒక బంధువుతో మాట్లాడి అతడి కుమారుడితో తన కుమార్తెకు పెళ్లి చేశాడు.తర్వాత డ్యూల్‌గాన్ కోల్‌కు చెందిన ఒక అమ్మాయితో ఆ వరుడి వివాహం కూడా జరిగింది.

తాజా వార్తలు