సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని మెజారిటీ హీరోయిన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.కొందరు హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా తమకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.
అయితే ప్రముఖ నటి ఇషా కొప్పికర్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నారు.ఒక స్టార్ హీరో తనను గదిలోకి ఒంటరిగా రమ్మన్నారని ఆమె కామెంట్లు చేశారు.
సినిమాలకు సంబంధించి నటిగా ఎలా కనిపిస్తున్నానం ఎలా నటిస్తున్నాం అనేది మాత్రమే ముఖ్యమని తాను అనుకున్నానని అయితే హీరోయిన్లు అంటే కొందరు హీరోల కంట్లో కూడా ఉంటామని తనకు తర్వాత అర్థమైందని ఆమె చెప్పుకొచ్చారు.ఒకరోజు జరిగిన ఘటన వల్ల తన హార్ట్ బ్రేక్ అయిందని ఆమె తెలిపారు.
అందరికీ కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయని నాకు కూడా పని కంటే లైఫ్ ముఖ్యమని ఆమె వెల్లడించారు.
అద్దంలో నన్ను నేను చూసుకునే సమయంలో తలెత్తుకునే విధంగా ఉండాలని ఆమె తెలిపారు.
ఒక ప్రొడ్యూసర్ తనకు కాల్ చేసి ఒక హీరో రాసుకున్న లిస్ట్ లో తాను కూడా ఉన్నానని చెప్పారని ఆ తర్వాత హీరోకు కాల్ చేస్తే హీరో ఒంటరిగా రూమ్ కు రావాలని పిలిచాడని ఆమె వెల్లడించారు.

హీరో నా వెంట స్టాఫ్ వద్దని చెప్పడంతో నాకు అసలు మ్యాటర్ అర్థమైందని ఆమె కామెంట్లు చేశారు.ఆ సమయంలో తాను అందం, పనితనం వల్లే ఈ స్థాయికి వచ్చానని చెప్పానని ఆమె అన్నారు.
ఒక మూవీ ఛాన్స్ కొరకు తాను దిగజారుతానని ఏ విధంగా ఊహించారని ఆమె కామెంట్లు చేశారు.
ఆ తర్వాత ఆ మూవీలో ఛాన్స్ కోల్పోయానని ఇషా కొప్పికర్ అన్నారు.హిందీ సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఇషా కొప్పికర్ తెలుగులో చంద్రలేఖ, ప్రేమతోరా సినిమాలలో నటించి ప్రశంసలను అందుకున్నారు.