తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సంతకాల సేకరణ

 

సంగీత దర్శకుడు, ప్రముఖ గాయకుడు స్వతంత్ర సమరయోధుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారత రత్న ఇవ్వాలి అంటూ అమెరికాలో శంకర నేత్రాలయ యూఎస్ ఏ అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో పలువురు కోరారు.

 

2.టాస్ ఉగాది 2022 సంబరాలు

 తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ వారు 2022  ఏప్రిల్ 9 వ తేదీ శనివారం ఎడిన్ బర్గ్ లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. 

3.చెన్నై కి ఎయిర్ అరేబియా కొత్త సర్వీస్

    యూ ఏ ఈ కి చెందిన లోకాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా తాజాగా భారత్ లోని చెన్నై కి  కొత్త సర్వీసు  ప్రారంబించింది. 

4.కెనడాలో తాకా వారి శ్రీ సీతారాముల కళ్యాణం

Advertisement

  తెలుగు అలియన్స్ ఆఫ్ కెనడా ( తాకా ) వారు శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.టొరంటో లోని శ్రీ శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 

5.హజ్ యాత్రకు వారికి మాత్రమే అనుమతి

  ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించి స్వల్ప మార్పులు జరిగాయి హనీ మైనారిటీ కార్పొరేషన్ సలహాదారు ఏకే ఖాన్ తెలిపారు.సౌదీ అరేబియా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం 65 ఏళ్లకు పైబడిన వారిని ఈ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఏకే ఖాన్ తెలిపారు. 

6.అప్పులు కట్టలేమంటున్న శ్రీలంక

  తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంక విదేశాల నుంచి తెచ్చిన అప్పులు కట్టలేము అంటూ ప్రకటించింది. 

7.ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటన

 రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం లో రష్యా కు చెందిన 19,600 మంది సైనికులు మరణించినట్టు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. 

8.బ్రిటన్ ప్రధానికి జరిమానా

 బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ కరోనా నిబంధనలు ఉల్లగించిన కారణంగా అధికారులు ఆయనకు పెనాల్టీ నోటీసులు పంపబోతున్నారు.           .

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు