తెలుగు చిత్ర పరిశ్రమకు అఖండ సినిమా ఒక దిక్సూచి: బాలకృష్ణ

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి నటించిన చిత్రం అఖండ.

ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాసింది.

ఇక ఈ సినిమా వంద రోజుల వేడుకను అఖండ చిత్రబృందం కర్నూలులో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ 100 రోజుల ఫంక్షన్ కు పెద్ద ఎత్తున నందమూరి అభిమానులతో పాటు అఖండ చిత్ర బృందం ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇక ఈ వేడుకల్లో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ అఖండ సినిమాకి అఖండమైన విజయం అందించిన ప్రేక్షక దేవుళ్ళు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఆడవాళ్లకు, పసిపిల్లలకు, ప్రకృతికి అన్యాయం జరిగినప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు రక్షిస్తాడనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చూపించాము.ఇలాంటి ఒక అద్భుతమైన సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించే అవకాశం మాకు కల్పించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అంటూ బాలయ్య మాట్లాడారు.

Advertisement

కరోనా విపత్కర సమయంలో థియేటర్లన్నీ మూతపడి సినిమాలు థియేటర్లో విడుదల అవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి.అలాంటి సమయంలో అఖండ సినిమా థియేటర్ లో విడుదలయ్యి తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, తెలుగు చిత్ర పరిశ్రమకు అఖండ సినిమా ఒక దిక్సూచి అని ఈ సందర్భంగా బాలకృష్ణ వందరోజుల వేడుకల్లో అక్కడ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ వేడుక కోసం దర్శకుడు బోయపాటి, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, ఇతర చిత్ర బృందం హాజరయ్యారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు