బడ్జెట్ లో విద్యారంగానికి మొండిచెయి- ఖమ్మంజిల్లా విద్యార్థిసంఘాల నాయకులు ఆగ్రహం

బడ్జెట్ లో ఖమ్మం జిల్లా కి యూనివర్సిటీ ఏర్పాటు అంశం చేర్చకపోవడాన్ని నిరసనగా ఖమ్మం నగరంలోని కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఎదుట PDSU, AISF, SFI విద్యార్థి సంఘాల ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించకుండా మొండి చెయ్యి చూపించిందని, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు గాని, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక గాని లేదని ఆరోపించారు.

 Stubborn To Education In Budget- Khammamzilla Student Union Leaders Angry-TeluguStop.com

ఖమ్మం జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని, బంగారు తెలంగాణను నిర్మిస్తామని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఖమ్మం జిల్లా కి జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు విషయాన్ని చేర్చకపోవడం దుర్మార్గం అన్నారు.జిల్లా కేంద్రంలో జనరల్ యూనివర్సిటీ లేకపోవడం వలన కాకతీయ, ఉస్మానియా, శాతవాహన లాంటి విశ్వవిద్యాలయాలకు విద్యార్థులు వలస వెళ్లే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా పైన విద్యారంగ సమస్యల పైన సవతితల్లి ప్రేమను చూపిస్తుందని విమర్శించారు.పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ అవలంభిస్తున్న మొండి వైఖరి పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను అందని ద్రాక్షలా మార్చే కుట్రలో భాగంగానే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మూసివేసి వాటిస్థానంలో ప్రైవేట్ యూనివర్సిటీ లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ లో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు మూసివేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకునే అవకాశం కోల్పోతారని యూజీసీ నిబందలనాల ప్రకారం యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ లెక్చరర్స్ పోస్టుల భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉమ్మడి జిల్లాలో జనరల్ యూనివర్సిటీ నెలకొల్పాలని జిల్లా ఎమ్మెల్యే లు మాట్లాడాలని వారు అన్నారు.ఉమ్మడి జిల్లా కేంద్రంగా యూనివర్సిటీ ప్రతిపాదన తీసుకొచ్చేందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని లేనియెడల ప్రజాప్రతినిధుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube