ఎన్టీఆర్ సినిమా వేస్తే చంపేస్తానని బాలయ్య బెదిరించారట.. ఏం జరిగిందంటే?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు సినిమా 2001 సంవత్సరంలో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.బి.

గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.జూనియర్ ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని సినిమా ఇదే సంవత్సరం మే 23వ తేదీన విడుదలైంది.

అయితే తన సినిమాను తొలగించి ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించడానికి నందమూరి బాలకృష్ణ అంగీకరించలేదని సమాచారం.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలలో చిన్న పాత్రల్లో నటించగా నిన్ను చూడాలని సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 4 లక్షల రూపాయలు కావడం గమనార్హం.అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.

Advertisement

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఆవుల గిరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నరసింహనాయుడు నైజాం హక్కులను మల్లారెడ్డి అనే వ్యక్తితో కలిసి తాను కొనుగోలు చేశానని వెల్లడించారు.

బి.గోపాల్ పై నమ్మకంతో ఆ సినిమా హక్కులను కొన్నామని ఆవుల గిరి అన్నారు.సినిమాలోని గుడి ఫైట్ సీన్ బి.

గోపాల్ చెప్పగా ఆ సీన్ నచ్చడంతో నిర్మాతను కలిసి సినిమా హక్కులను కొన్నామని ఆవుల గిరి చెప్పుకొచ్చారు.

తారక్ తొలి సినిమా నిన్ను చూడాలని కొరకు దేవి థియేటర్ కావాలని అడిగారని ఆ థియేటర్ లో నరసింహ నాయుడు సినిమా అప్పుడు ప్రదర్శిస్తునామని తాను నిర్మల్ లో ఉండగా బాలయ్య తనను దేవి థియేటర్ లో సినిమా ఆడించే విషయంలో బూతులు తిట్టి చంపేస్తామని చెప్పారని నిన్ను చూడాలని సినిమాను వేరే థియేటర్ లో వేశామని ఆవుల గిరి తెలిపారు.నిన్ను చూడాలని సినిమాను తాను డిస్ట్రిబ్యూట్ చేశానని ఆవుల గిరి చెప్పుకొచ్చారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు