తిరుమల శ్రీవారికి ఎన్ని ప్రసాదాలు పెడ్తారో తెలుసా?

తిరుపతి వేంకటేశ్వ స్వామి గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తిరుమలకు కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి.

ఇందుకు ప్రధాన కారణం స్వయం వ్యక్తం రూపంలో ఏడు కొండల వాడు వెలవడం.అంతే కాకుండా తిరుపతి అనగానే మనకు ఎక్కువగా లడ్డూనే గుర్తుకు వస్తుంది.

ఎందుకంటే తిరుపతి లడ్డుకు అంత ప్రాధాన్యం ఉంటుంది.మరి లడ్డూయే కాకుండా శ్రీనివాసుడికి ఇంకా ఏయే ప్రసాదాలు నివేదిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

స్వామి వారి నైవేద్య సమర్పణకు ఎంతో చరిత్ర ఉంది.ఎందుకంటే స్వామి వారు అర్చన, ఉత్సవ, సంకీర్తనతో పాటు నైవేద్య ప్రియుడు కూడా.

Advertisement

అందుకే ఎంతో మంది భక్తులు వితరణ ఇచ్చి మరీ ప్రసాదాలను చేయించేవారు.ప్రతిరోజూ స్వామి వారికి త్రికాల నైవేద్యం ఉంటుంది.

నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంటగా వ్యవహరిస్తారు.ఇందులో భాగంగా గురు, శుక్ర వారాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు.స్వామి వారి తొలి నివేదనకు ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవగా.చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్దోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు లడ్డూలు, వడలు నివేదిస్తారు.

రెండో గంట ఉదయం 10 గంటలకు.పెరుగన్నం, చక్ర పొంగలి, పులిహోర, మిర్యా పొంగలి, సీర, సేకరబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు.మూడో గంట రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభమవగా.కదంబం, మొలహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలతో పాటు ఆదివారం అయితే ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని శ్రీవారికి సమర్పిస్తారు.

పసుపు, నిమ్మ టీ తో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు