రియల్ హీరో అరుదైన ఘనత.. ట్విట్టర్ లో ఆ రికార్డ్..

సోనూ సూద్ పేరు ఈ మధ్య కాలంలో బాగా వినపడుతుంది.

కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేసిన సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన చాలా సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అని అనిపించు కున్నాడు.కరోనా కష్టాలు స్టార్ట్ అయినప్పటి నుండి పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎందరికో సోనూసూద్ తనకు చేతనైనంత సహాయం చేస్తూ అందరి చేత శభాష్ అనిపించు కున్నాడు.

ప్రజల కష్టాలకు స్పందించి ప్రజల గుండెల్లో రియల్ హీరోగా నిలిచాడు.ఎంతో మంది వలస కార్మికులకు తన సొంత డబ్బులను ఉపయోగించి వారిని వారి వారి ఇళ్లకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేసి స్వస్థలాలకు చేర్చాడు.

లాక్ డౌన్ తర్వాత కూడా ఎంతో మంది పేద విద్యార్థులకు, రైతులకు ఆయన అందించిన సేవలకు దేశం మొత్తం ఆయనను పొగడ్తలతో ముంచెత్తింది.జనాలు రియల్ హీరో అని మెచ్చుకున్నా సోనూసూద్ మాత్రం మానవత్వంతో కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడమే నా విధి అని తెలియజేస్తూ మరోసారి తన మంచి మనసును, మానవత్వాన్ని చాటుకున్నారు.

Advertisement

దీంతో ఆయనకు జనం నీరాజనాలు పలుకు తున్నారు.ఇప్పటికి సోనూసూద్ సోషల్ మీడియా వేదికగా ఆయనను సహాయం కోరి వస్తే తప్పకుండ సహాయం చేస్తున్నాడు.

దీంతో ఈయనకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోయింది.రోజురోజుకూ ఆయన జనాలకు మరింత చేరువ అవుతున్నాడు.తాజాగా ఆయన ట్విట్టర్ లో అరుదైన ఘనత అందుకున్నాడు.

సోనూసూద్ కు రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో ఆయన అకౌంట్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది.ట్విట్టర్ అకౌంట్ ను 11 మిలియన్ మార్క్ టచ్ చేసింది.

దీంతో ఆయన ఇండియాలో అత్యధికంగా అనుసరించే ప్రముఖుల లిస్టులో చేరిపోయాడు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు