ప్రేయ‌సి తల్లికి కిడ్నీ ఇచ్చిన ప్రియుడు.. అయినా అత‌న్ని పెండ్లి చేసుకోలేదు..

ప్రేమ రెండక్షరాల పదం.ఈ పదం రెండక్షరాలే అయినా కానీ చాలా పవర్ ఫుల్.

ఈ పదంతో అనేక మంది అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొంత మంది హాయిగా ఉంటే కొంత మంది మాత్రం సఫర్ అవుతూ ఉంటారు.

ఈ ప్రపంచంలో ప్రేమ వల్ల జరిగిన యుద్ధాలు ఎన్నో.ఆ యుద్ధాల వలన నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు.

ఈ ప్రేమ గుడ్డిదని కొంత మంది చెబుతారు.అందుకోసమే ప్రేమలో ఉన్నపుడు ఎటువంటి నిజాలు చెప్పినా కానీ చెవికెక్కవని అంటుంటారు.

Advertisement

ఇదే విషయం కరెక్టని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది.కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ విషయం కరెక్ట్​ కాదనిపిస్తుంది.

ఇప్పుడు ప్రస్తుతం ఓ వ్యక్తి ప్రేమ కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అతడి అమర ప్రేమను గురించి తెలుసుకొని చాలా మంది నెటిజన్లు అతడిని ఓదారుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ ఆ అమర ప్రేమికుడు ఎవరంటే.మెక్సికోకు చెందిన టీచర్ ఉజీల్ ప్రేమ కథ ఇప్పుడు అందరినీ కలిచి వేస్తోంది.

అతడి లవ్ స్టోరీని విన్న ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అనుకుంటూ తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.ఉజీల్ ఒక యువతిని ప్రేమించాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఎంతలా అంటే విధి విస్తుపోయేలా ఆ యువతిని ఉజీల్ ప్రేమించాడు.మధ్యలో ఒక సారి ఆ యువతి తల్లికి కిడ్నీ అవసరమైతే మనోడే దానం చేశాడు.

Advertisement

అంతలా గుడ్డిగా ప్రేమించిన ఉజీల్ ను ఆ అమ్మాయి చివరికి పెళ్లి చేసుకోలేదు.ఏంటి అనుకుంటున్నారా.

మీరు చదివింది నిజమే.అంతలా గాఢంగా ప్రేమించిన ఉజీల్ ను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి వెళ్లిపోయింది.

ఇదంతా ఉజీల్ తన టిక్ టాక్ వీడియోలో అందరితో షేర్ చేసుకున్నాడు.

తాజా వార్తలు