న్యూస్ రౌండప్ టాప్ 20

1.రఘురామ కృష్ణంరాజుకు సిఐడి నోటీసులు

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణంరాజు కు సిఐడి అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి అందించారు.

ఈనెల 17వ తేదీన సిఐడి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు.

2.ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా

కర్నూలు జిల్లా శ్రీశైలం వైసిపి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

3.విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి సమీక్ష

ఏపీ తెలంగాణ విభజన అంశాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ బల్లా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు

4.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,94,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

5.ప్రగతి భవన్ ముట్టడికి ప్రభుత్వ టీచర్ల ప్రయత్నం

317 జీవోను నిలిపివేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

6.దొరా అంటూ కేసీఆర్ పై షర్మిల సెటైర్లు

Advertisement

తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కామెంట్స్ చేశారు.సీఎం కేసీఆర్ ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి దొరా  అంటూ షర్మిల సెటైర్లు వేశారు.

7.ఏపీలో థియేటర్ల సమస్య పై తెలంగాణ మంత్రి స్పందన

ఏపీలో థియేటర్ల సమస్య తాను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.

8.కేసిఆర్ పై బండి సంజయ్ ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి పై కేంద్రం సీరియస్ గా ఉందని ఆయన ఎప్పుడైనా జైలుకు వెళ్లే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

9.సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ రాణి గంజి లోని ఫిలిప్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

10.ఉమ్మడి వరంగల్ జిల్లా లో వడగళ్ల వాన

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.

11.వేములవాడ రాజన్న దర్శనానికి రేపు బ్రేక్

వేములవాడ రాజన్న క్షేత్రం లో అధికారులు చర్యలు చేపట్టారు.ఈ నెల 13న ముక్కోటి ఏకాదశి రోజున భక్తులను ఆలయంలోనికి అనుమతించలేదు లేదని అధికారులు తెలిపారు.

12.రేపు గట్టు ఎత్తిపోతల కు టెండర్ నోటిఫికేషన్

పూర్వ మహబూబ్ నగర్ జిల్లా గద్వాల లోని కరువు ప్రాంతానికి జూరాల రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తి పోయడానికి వీలుగా 581.06 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇవ్వడంతో గురువారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

13.47 ప్రైవేట్ బస్సులపై కేసులు

సరైన అనుమతి పత్రాలు లేకుండా సంక్రాంతి సందర్భంగా అనేక ప్రాంతాలకు బస్సు నిర్వహిస్తున్న 42 బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.

14.కర్నూల్ జిల్లాలో కరోనా కలకలం

కర్నూల్ జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి పంట పొలాల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.

15.కెప్టెన్ అమరీందర్ సింగ్ కు కరోనా పాజిటివ్

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

16.తమిళనాడు లో జల్లికట్టు వాయిదా

తమిళనాడు లో సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా జల్లికట్టు ను వాయిదా వేశారు.

17.కోడిపందాల పై పోలీసుల ఆంక్షలు

Advertisement

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోడిపందేలపై ఆంక్షలు విధించినట్లు సీపీ కాంతి రాణా టాట తెలిపారు.

18.నితిన్ గట్కారికి కరోనా

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

19.అనందయ్యకు ఆయుష్ శాఖ నోటీసులు

కరోనా కు నాటు మందు అందించిన కృష్ణపట్నం అనందయ్య కు ఆయుష్ శాఖ నోటీసులు జారీ చేసింది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,940 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 48,940.

తాజా వార్తలు