ఆ ఒక్క మాటతో అడ్డంగా బుక్కైన రామ్ గోపాల్ వర్మ.. ఏం జరిగిందంటే?

గత కొద్ది రోజులుగా ఏపీలో టికెట్ ల వ్యవహారం గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అలాగే ఏపీ మంత్రుల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.

టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలపై విమర్శలు చేస్తూ వస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.

ఆ విమర్శలపై సినిమాటోగ్రాఫర్ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ వచ్చాడు.ఈ సమయంలోనే రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ మంత్రి గారు మీరు మాకు అపాయింట్మెంట్ ఇస్తే మా సమస్యలు మీతో చర్చి స్తాము అని ఆర్జీవి విన్నపం చేశాడు.

ఇక వర్మ విన్నపాన్ని అంగీకరించిన పేర్నినాని కలుద్దాం అన్నట్టుగా ట్వీట్ చేశాడు.అలా మొత్తానికి వర్మకు మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే వర్మ ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.తనకు అపాయింట్మెంట్ దొరికింది అన్న ఆనందంలో వర్మ తొందరలో ట్వీట్ చేస్తూ చిన్న బ్లండర్ మిస్టేక్ చేశాడు.

Advertisement

దీనితో వర్మ అని నెటిజన్లు ఏకిపారేశారు.ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.

మంత్రి పేర్ని నాని ని డిసెంబర్ 10న కలవబోతోన్నాను అని రాసి ఉంది.ఈ విషయంలో అందరూ వర్మను దారుణంగా ట్రోల్ చేశారు.

తాగి ట్వీట్ వేశావా? లేదా నువ్ ఇంకా గత ఏడాదిలోనే ఉన్నావా? లేదంటే ఈ ఏడాది డిసెంబర్ 10న అని చెబుతున్నావా? అంటూ వర్మను ఏకిపారేశారు.

అయితే తన తప్పును తెలుసుకున్న వర్మ ఆ ట్వీట్ డిలీట్ చేస్తూ మొత్తానికి మరొక ట్వీట్ చేశాడు.అందులో జనవరి 10 అంటూ కరెక్ట్‌గా డేట్‌ను ప్రకటించాడు.అలా మొత్తానికి రాంగోపాల్ వర్మ తొందరలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో కొద్ది క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీనితో నెటిజన్లు వర్మ కామెంట్లతో రకరకాలుగా ఆడేసుకున్నారు.మరి జనవరి 10న మంత్రి నానితో మీట్ అయినప్పుడు ఆర్జీవి ఎలాంటి చర్చలు పెడతారో చూడాలి మరి..

Advertisement

తాజా వార్తలు