అమెరికా: జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యపై కీలక పత్రాలు విడుదల చేసిన బైడెన్ సర్కార్

అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యపై జరిగిన విచారణకు సంబంధించిన దాదాపు 1500 పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్ బుధవారం విడుదల చేసింది.కెన్నెడీ హత్యకు సంబంధించి సీక్రెట్ కేబుల్స్, అంతర్గత మెమోలు, ఇతర పత్రాలను బహిర్గతం చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ అక్టోబర్‌లో అధికారులకు గడువు ఇచ్చారు.

ప్రభుత్వ ఆధీనంలోని రికార్డులను విడుదల చేయాలనే సమాఖ్య శాసనానికి అనుగుణంగా నేషనల్ ఆర్కైవ్స్ స్పందించింది.1963 నవంబర్ 22న డల్లాస్‌లో లీ హార్వే ఓస్వాల్డ్ చేతిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు గురయ్యారు.అయితే ఈ ఘటన నాటి నుంచి అనేక అనుమానాలను కలిగించింది.

వీటిని నివృత్తి చేయాలని ప్రభుత్వం భావించింది.ఈ రహస్య పత్రాల విడుదల కోసం చరిత్రకారులు, ప్రజలు ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూశారు.

నిందితుడు ఓస్వాల్డ్ మెక్సికో నగరంలోని సోవియట్, క్యూబా రాయబార కార్యాలయాల సందర్శనల గురించి కూడా ఈ పత్రాల్లో ప్రస్తావించారు.కెన్నెడీ హత్య తర్వాత ఈ కుట్రలో క్యూబా ప్రమేయపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

సోవియట్ యూనియన్‌ను సందర్శించడానికి వీసా కోసం మెక్సికో నగరంలో వున్నప్పుడు ఓస్వాల్డ్ సోవియట్ రాయబార కార్యాలయానికి ఎలా ఫోన్ చేశాడో సీఐఏ కేబుల్‌లో వివరించారు.కెన్నెడీ హత్యకు నెల రోజుల ముందు అక్టోబర్ 3, 1963న టెక్సాస్ సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఓస్వాల్డ్ అమెరికాలోకి ప్రవేశించాడని సీఐఏ తన పత్రాల్లో తెలిపింది.కెన్నెడీ హత్య జరిగిన తర్వాతి రోజున .మెక్సికో సిటీలో ఓ ఫోన్‌కాల్‌ను సీఐఏ అడ్డగించింది.ఆ కాల్‌లో ఓస్వాల్డ్ .కేజీబీ అధికారితో మాట్లాడినట్లుగా ఓ మెమోలో తెలిపారు.సీఐఏ కేబుల్ ప్రకారం.

Advertisement

ఓస్వాల్డ్ కమ్యూనిస్ట్, క్యాస్ట్రో ఆరాధకుడిగా సీఐఏ తెలిపింది.మరో ‘‘సీక్రెట్ ఐస్ ఓన్లీ’’ అని గుర్తుపెట్టిన సీఐఏ పత్రంలో.

క్యూబా నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రోను హత్య చేయడానికి యూఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని చెప్పబడింది.నిందితుడు న్యూఓర్లీన్స్‌లో నివసిస్తున్న సమయంలో.

క్యాస్ట్రోతో జరిపిన ఇంటర్వ్యూను చదివి వుండవచ్చని మరొక పత్రంలో తెలిపారు.ఈ పత్రాలకు సంబంధించిన విషయాలను గతంలోనే బహిర్గతం చేయాల్సిందిగా డిమాండ్లు వచ్చినప్పటికీ.

ఎఫ్‌బీఐ, సీఐఏల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా 2017లో నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వందలాది రికార్డుల విడుదలను నిలిపివేశారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు