గొడవలు రాకుండా అగ్రిమెంట్లు చేసుకున్న మెగా, నందమూరి ఫ్యాన్స్.. ఏమైందంటే?

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా జనవరి 7న రిలీజ్ కానుంది.ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులతోపాటు, ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ జక్కన్న విడుదల చేశారు.

ఈ అప్డేట్స్ సినిమా పై మరింత ఆసక్తి నెలకొల్పాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు.

Advertisement

ఈ క్రమంలోనే చెర్రీ , నందమూరి అభిమానుల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ అగ్రిమెంట్స్ చేసుకున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో ఇద్దరూ స్టార్ హీరోలే పైగా ఇద్దరి హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ వారి వారి రోల్స్ చేయించామని ఇప్పటికే రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు.

దీంతో అటు మెగా, ఇటు నందమూరి శిబిరాలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి.జనవరి 7న ఈ సినిమా దాదాపుగా 10,000కు పైగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇరు వర్గాల ఫ్యాన్స్ నడుమ వార్ నడిచే అవకాశాలు లేకపోలేదు.

అందువల్ల దీనినే ముందే ఊహించిన మెగా, నందమూరి ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని సంతకాలు కూడా చేసుకున్నారట.ఎవరికీ వారు కొన్ని థియేటర్లను కేటాయించుకుని ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో థియేటర్ దగ్గర హడావిడి చేయకూడదని నిర్ణయించుకున్నారట.అలాగే ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్ ఉన్న థియేటర్ల వద్ద బ్యానర్లు, నినాదాలు చేయకూడదని, అంతా కలిసి ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యారట.

చరిత్రలో తొలిసారి ఇలాంటి ఒప్పందాలు చూస్తున్నాం.మరి ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు వారు ఒప్పుకున్న ఒప్పందాలకు ఎంతమాత్రం కట్టుబడి ఉంటారో చూడాలి మరి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు