మ్యాచ్ మధ్యలోనే వెరైటీగా లవ్ ప్రపోజ్ చేసిన సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో లవ్ ప్రపోజల్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.

ఈ మధ్య కాలంలో బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఒక జంట అందరిముందే తమ ప్రేమను వ్యక్తం చేసుకుని, ముద్దులతో హగ్గులతో తెగ హడావుడి చేసేసారు.

ఈ వీడియో కొద్ది రోజుల క్రితమే నెట్టింట్లో వైరల్‌గా మారింది. సరిగ్గా మళ్ళీ అలాంటి సంఘటనే ఇప్పుడే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అయితే ఈ వెరైటీ లవ్ ప్రపోజల్ ఆడ మగ మధ్య జరగలేదు.ప్రేమకు లింగబేధం తో సంబంధం లేదు అంటూ ఒక మహిళ మరో మహిళకు తన ప్రేమను వ్యక్తపరిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అసలు వివరాల్లోకి వెళితే.ఆస్ట్రేలియాలోని పెర్త్‌ వేదికగా జరిగిన ఓ సాఫ్ట్‌బాల్‌ టోర్నీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

ఆ ఇద్దరూ కూడా ప్రొఫెషనల్‌ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణులే.వారిలో ఒకరు రియో మరొకరు జసింతా కమాండే.

వీరిద్దరూ లింగ బేధం లేకుండా రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు.ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌ వేదికగా జరిగిన తాజా మ్యాచ్‌లో ఆట ఆడుతుండగా సారా మధ్యలో గాయపడినట్లు నేలపై కుప్పకూలి పడిపోతుంది.

సారా పడిపోవడాన్ని చూసిన జసింతా స్టాండ్స్‌ నుంచి మైదానంలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది.అప్పటివరకు బాధతో విలవిల్లాడినట్లు కనిపిస్తున్న సారా జసింతా రావడాన్ని గమనించి ఒక్కసారిగా మోకాళ్లపై నిల్చోని లవ్ ను ప్రపోజ్‌ చేస్తుంది.

సడెన్ గా సారా లవ్ ప్రపోజ్ చేయడం చూసి జసింతాతో సహా మైదానంలో ఉన్న అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.కొద్ది సేపటి తర్వాత జసింతా తన ప్రేమను అంగీకరించి ప్రేయసి సారాను ప్రేమగా హత్తుకును ముద్దు పెట్టుకుంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

వీరి ప్రేమను చూసిన మైదానంలోని ప్రేక్షకులు,ఆటగాళ్లు అందరు చప్పట్లు, అరుపులతో మోత మోగించేసారు.ఇంకో విశేషం ఏంటంటే.

Advertisement

ఈ మ్యాచ్‌కు సారా తన మిత్రులు, కుటుంబ సభ్యులనందరీని ఆహ్వానించి వారి సమక్షంలోనే తన పెళ్లి ప్రపోజల్‌ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

తాజా వార్తలు