న్యూస్ రౌండప్ టాప్ 20

1.  అండమాన్ లో అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం

దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే ఎందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

2.జగన్ కు లోకేష్ లేఖ

ఏపీ సీఎం జగన్ కు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.ఈ సారి గ్రామ పంచాయితీ లకు మళ్లించిన 1309 కోట్లు తక్షణమే పంచతీల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.

3.విద్యా దీవెన డబ్బులు విడుదల

ఏపీ సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన కింద మూడో త్రైమాసికం డబ్బులు విడుదల చేశారు.

3.కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్

యాసంగి లో ధాన్యం కనుక పోతే అంతు చూస్తానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.

4.రేపటి నుంచి ఎన్టీఆర్ వర్సిటీ ఉద్యోగుల విధుల బహిష్కరణ

రేపటి నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు విధుల బహిష్కరణ కు పిలుపునిచ్చారు.

5.చార్ ధాం దేవస్థానం బోర్డు రద్దు

చార్ ధాం దేవస్థానం బోర్డు ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది.

6.లోక్ సభ మళ్లీ వాయిదా

Advertisement

ధాన్యం శేఖర్ అన్న పై కేంద్రం స్పష్టమైన విధానాన్ని పరిష్కరించాలని టిఆర్ఎస్ లోక్ సభలో డిమాండ్ చేసింది.అంతే కాదు దీనిపై పోడియం వద్ద టీఆర్ఎస్ ఎంపీ లు నినాదాలు చేపట్టడం తో లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు.

7.కేటీఆర్ ను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మంత్రి కేటీఆర్ ను కలిశారు.

8.పరిశ్రమలకు విశాఖ అనుకూలం

పరిశ్రమలకు విశాఖ అనుకూలం అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు.

9.సిరివెన్నెల సీతారామశాస్త్రి పరిస్థితి విషమం

న్యూమోనియా తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

10.రెడ్ మీ నోట్ 11 టి విడుదల

రెడ్ మీ నోట్ 11 టి భారత్ లో లాంచ్ అయ్యింది.

11.జై భీమ్ కు అరుదైన గౌరవం

సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది.సుమారు 53, 000 ఓట్లు, 9.6 రేటింగ్ తో ఈ సినిమా మొదటిస్థానంలో నిలిచింది

12.కేసీఆర్ పై రేవంత్ కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బాబాయ్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.రైతుల వద్ద కొనుగోలు చేయలేనప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు.

13.తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు

ఇతర రాష్ట్రాల నుంచి దాన్యం లోడు వాహనాలు తెలంగాణలో అడుగు పెట్టకుండా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

14.భారత్ లో కరోనా కట్టడి నిబంధనలు పొడిగింపు

భారత్ లో కొత్త కరోనా వేరియంట్ రాకుండా భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది.ఈ మేరకు కరోనా కట్టడి నిబంధనలు డిసెంబర్ 31 వరకు పొడిగించారు.

15.ట్విటర్ సీఈఓ గా భారతీయుడు

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ట్విట్టర్ నూతన సీఈఓగా భారత్ కు చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు.

16.అర్బన్ ఎస్పీనీ కలిసిన టీడీపీ నేతలు

టిడిపి కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో అర్బన్ ఎస్పీ  ఆరిఫ్ హరీజ్ ను టీడీపీ నేతలు కలిశారు.దీనికి సంబంధించిన కేసు పై ఆరా తీశారు.

17.హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సమావేశం

హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సమావేశం ఈరోజు లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న టీయూ డబ్ల్యూ జె కార్యాలయంలో జరిగింది.

18.వడ్ల విషయం పై కెసిఆర్ పై షర్మిల కామెంట్స్

Advertisement

వడ్లు కొనుగోలు చేయడం చేత కానప్పుడు అధికారం మీకెందుకు అంటూ వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల కామెంట్స్ చేశారు.

19.సంధ్యా కన్స్ట్రక్షన్స్ ఎండీ కి లుక్ ఔట్ నోటీస్

చీటింగ్ కేసులో సంధ్యా కన్స్ట్రక్షన్స్ ఎం.డి శ్రీధర్ కు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,120 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,120 .

తాజా వార్తలు