వైరల్ వీడియో... సైకిల్ పై షికారు చేస్తున్న వానరం

మామూలుగా మనకు కోతులనుచూడగానే ఓ భావం కావచ్చు, మన లాంటివే అనే భావన కలుగుతుంది కదా.

ఎందుకంటే మనం కోతుల నుండే వచ్చాం అన్న ఓ నానుడి ఉన్న తరుణంలో కోతి చేష్టలు అని మనం చాలా సార్లు అంటూ ఉంటారు.

అయితే మనం చాలా సార్లు కోతులను ఇండ్లలో చొరబడి గందరగోళం సృష్టించగా చూసి ఉంటాం, అటు చెట్ల మీద అటు ఇటు దూకుతూ ఉండగా చూసి ఉంటాం.ఎంత కోతి అయినా మనం చేసే కొన్ని పనులు చేయలేదేమో అనే భావన అయితే ఇప్పటికీ చాలా మందిలో ఉంటుంది.

కానీ అప్పుడప్పుడు కోతులు చేసే పనులు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.మామూలుగా చిన్న పిల్లలు సైకిల్ తొక్కడమే చాలా కష్టం.

కానీ ఈ కోతి చూడండి అచ్చం మనిషిలాగా ఈ చిన్న కోతి ఎలా సైకిల్ ను తొక్కుతూ షికారు చేస్తోందో.అంతేకాక బుద్ధిగా బ్యాగ్ వేసుకొని స్కూల్ కు వెళ్తుందో.

Advertisement

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది.అసలు కోతి చేస్తున్న చేష్టలకు ఇది అసలు కోతేనా అన్న అనుమానం రాకమానదు.

అయితే ఈ వీడియోపై నెటిజన్లు చేస్తున్న కామెంట్లతో మరింత వైరల్ గా మారుతోంది.

  అచ్చం చిన్న పిల్లల మాదిరి సైకిల్ తొక్కుతున్న ఈ వీడియో చూస్తుంటే మా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి ఇటువంటి కోతి మాకు కావాలి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనా నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఎంతో ఆసక్తిగా ఉంది కదా.ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు