కేసీఆర్ మారాల్సిందేనా ? తప్పదా ? 

కేసిఆర్ మారాల్సిందే.మారి తీరాల్సిందే.లేకపోతే పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడం ఖాయం.

ఇవన్నీ ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు నుంచి వినిపిస్తున్న మాటలు .2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగుతూ వస్తోంది.2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో టీఆర్ఎస్ విజయం సాధించింది.2019లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా , తమ రాజకీయ ప్రత్యర్ధులు బలపడకుండా చేయాలనే ఉద్దేశంతో కెసిఆర్ 2018 లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.అనుకున్నట్లుగానే రెండోసారి టిఆర్ఎస్ విజయం సాధించింది.

అయితే రెండోసారి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతూనే వస్తోంది.ఆర్థికంగా రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు,  టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వంటి వ్యవహారాలు ఆ పార్టీపై వ్యతిరేకత పెంచుతూ వస్తున్నాయి.

దానికి ఫలితమే అన్నట్లుగా దుబ్బాక,  హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందటం వంటివి రుజువు చేశాయి.అసలు తెలంగాణలో తమకు పోటీ కాదు.

పోటీలో లేదు అనుకున్న బిజెపి ఇప్పుడు సవాల్ విసిరే స్థాయికి రావడం ఇవన్నీ టిఆర్ఎస్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి .అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం కేసీఆర్ ఫామ్ హౌస్ కి  పరిమితం అయ్యి పరిపాలన మర్చిపోయారు అని,  ఆ ఎఫెక్ట్ తోనే ఫలితాలు ఈ విధంగా వచ్చాయనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది.

Advertisement

పార్టీలోను ప్రభుత్వంలోను అంతర్గత ప్రజాస్వామ్యం పెంపొందించేలా కెసిఆర్ సర్వ తీసుకోవాలని కేవలం మంత్రులు,  ఎమ్మెల్యేలకు మాత్రమే కాకుండా స్థానిక నాయకులకు స్వేచ్ఛ కల్పిస్తే వారు ప్రజలకు మరింత మేలు కలిగే విధంగా చేయగలుగుతారని సూచిస్తున్నారు.సామాన్య ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కార మార్గాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకునే విధంగా స్వేచ్ఛ కల్పించాలని సూచిస్తున్నారు.ప్రస్తుతం అమలు చేస్తున్న కొన్ని కొన్ని సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు పెద్దగా మేలు జరగడం లేదని, వాటిని పూర్తిగా ప్రక్షాళన చేసి అర్హులకు అందేలా చూడాలని పార్టీ నాయకులు సూచిస్తున్నారు.

ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు జిల్లాల వారీగా కేసీఆర్ పర్యటన చేపట్టి,  పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఉత్సాహం కలిగించే చేయాలని ముఖ్యంగా రైతులకు మేలు చేసే అంశాలపై దృష్టి పెట్టి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా కెసిఆర్ రాజకీయ వ్యూహానికి పదును పెడితే టిఆర్ఎస్ కు తిరుగు ఉండదనే విషయాన్ని కిందిస్థాయి నాయకులే ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు