వెంటనే ఆవిడ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటున్న నెటిజన్లు..!

టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.

గురువారం రోజున ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది.

ఈ క్రమంలోనే పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ కు సపోర్ట్ చేసేందుకు ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వెళ్లడం జరిగింది.అలా సానియా మీర్జా పాకిస్తాన్ ఆటగాళ్లకు సపోర్ట్ చేయడంపై ఇప్పుడు నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సానియా మీర్జా భారత దేశ పౌరసత్వం రద్దు చేయామని నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.అంతేకాకుండా సానియా మీర్జాపై ఉపా చట్టం పెట్టి భారత దేశ పౌరసత్వం రద్దు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే ఈ మ్యాచ్‌ లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొడుతున్నప్పుడు గాని, ఆస్ట్రేలియా ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు గాని సానియా తెగ సంతోషపడుతూ చప్పట్లు కొడుతూ పాకిస్తాన్ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం మనం గమనించవచ్చు.

Advertisement

అలాగే స్కాట్లాండ్‌ తో జరిగిన మ్యాచ్‌ లోను భర్త షోయబ్ మాలిక్ సిక్సర్లు కొడుతుంటే కూడా సానియా మీర్జా చప్పట్లు కొట్టి మరి భర్తను ఎంకరేజ్ చేస్తూ వచ్చింది.ఆ సమయంలో కూడా నెటిజన్లు ఆమెపై విరుచుకొని పడ్డారు.అసలు స్వదేశీయురాలు అయి వుండి మన శత్రుదేశానికి సపోర్ట్ చేయడం ఏంటి అని ఆమె పౌరసత్వం రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, అమిత్ షాతోపాటు మరికొందరి ప్రముఖులకు ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు