రామ్ చరణ్ కి చిరంజీవి సినిమా అసలు నచ్చలేదట.. అది ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా స్టార్ గా నిలిచి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు చిరంజీవి.

తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సినిమాలలో నటించాడు.

ఇక ఈయన తన వారసుడు రామ్ చరణ్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోగా ఎదిగేలా చేశాడు.ఇక వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో కూడా నటించారు.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ కు తన తండ్రి చిరంజీవి నటించిన ఓ సినిమా అస్సలు నచ్చలేదట.నిజానికి చిరంజీవి సినిమాలు అన్ని మంచి హిట్ లను అందుకున్నవే.

ఇక ఈయన నటించిన ప్రతి ఒక్క సినిమాను అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.చాలా వరకు ఈయన సినిమాలు అందరికీ నచ్చుతాయి.

Advertisement

కానీ తను నటించిన ఒక సినిమా తన కొడుకు రామ్ చరణ్ కు నచ్చలేదట.

ఇంతకు ఆ సినిమా ఏదో కాదు బిగ్ బాస్.రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమంలో పాల్గొన్న తన తండ్రి చిరంజీవి గురించి చెప్పకుండా అస్సలు ఉండలేడు.పైగా తన తండ్రి నటించిన సినిమాల గురించి కూడా అద్భుతంగా చెబుతాడు.

అలా తన తండ్రి నటించిన సినిమాలలో తనకు బాగా నచ్చిన సినిమా విజేత.ఈ సినిమా గురించి చాలాసార్లు రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

కానీ బిగ్ బాస్ సినిమా మాత్రం తనకు నచ్చదని తానే స్వయంగా మాత్రం చెప్పలేదు.గతంలో ఓసారి రామ్ చరణ్ కు తన తండ్రి నటించిన సినిమాలలో నచ్చని సినిమా ఏంటో చెప్పమని ప్రశ్న ఎదురవడంతో చాలాసార్లు ఈ జవాబు చెప్పడానికి బాగా తడబడ్డాడు.కానీ ఓసారి ఈ సినిమా తనకు నచ్చదని చెప్పకనే చెప్పాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తన తండ్రి నటించిన అన్ని సినిమాలు తనకు పాఠాలుగా ఉపయోగపడ్డాయని కానీ ఒక బిగ్ బాస్ సినిమా మాత్రం తప్ప అన్ని అనేసరికి రామ్ చరణ్ కు ఈ సినిమా నచ్చలేదని అర్థమైంది.అలా రామ్ చరణ్ కు ఆ సినిమా నచ్చకపోవడంతో ఎందుకు నచ్చలేదన్న విషయాన్ని మాత్రం చెప్పలేకపోయాడు.

Advertisement

ఇక ఇప్పటికీ కూడా తన సినిమాల కంటే తన తండ్రి చిరంజీవి సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు రామ్ చరణ్.పైగా తన తండ్రి సినిమాలలో తనకు నటించే అవకాశం వస్తే ఎంతో అదృష్టమని ఫీల్ అవుతుంటాడు.ఈ విషయాన్ని కూడా చాలాసార్లు తెలిపాడు.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో పాటు తన తండ్రి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా మరోసారి తన తండ్రి సరసన నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఎటువంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి.

చిరంజీవి కూడా ఈ సినిమాతో పాటు లూసిఫర్ రీమేక్, వేదళం రీమేక్ లో నటిస్తున్నాడు.

తాజా వార్తలు