రజినీకాంత్ 'పెద్దన్న' తెలుగు టీజర్.. అదే స్టైల్.. అదే మాస్..!

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కోలీవుడ్ డైరక్టర్ శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా అన్నాత్తే.

తెలుగులో ఈ సినిమాకు పెద్దన్న అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈమధ్యనే అన్నాత్తే తమిళ టీజర్ రిలీజ్ కాగా లేటెస్ట్ గా పెద్దన్న తెలుగు టీజర్ రిలీజ్ చేశారు.

ఎప్పటిలానే సూపర్ స్టార్ రజిని తన స్టైల్, మాస్ లుక్ తో ఆడియెన్స్ ను అలరించేలా ఉన్నారు.టీజర్ లో డైలాగ్ కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

పెద్దన్నగా వస్తున్న రజినీకాంత్ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

కీర్తి సురేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.తప్పకుండా ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ మెచ్చేలా ఉంటుందని అంటున్నారు.

శివ, రజినీ కాంబోలో వస్తున్న పెద్దన్న ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.సినిమాలో రజిని స్టైల్ కు ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతారని అంటున్నారు.

ఇక టీజర్ చివర్లో వ్యాన్లు అలా బ్లాస్ట్ అవడం మాస్ ఆడియెన్స్ కు ఈ సినిమా ఓ రేంజ్ లో నచ్చేస్తుందని అంటున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు