ఆ ముగ్గురు 'మా' లో ఉన్నట్లా? లేనట్లా?

మా ఎన్నికలు పూర్తి అయ్యాయి.అయినా కూడా రచ్చ మాత్రం ఆగడం లేదు.

పెద్ద ఎత్తున మా ఎన్నికల రచ్చ.ఎన్నికలు ఆ తర్వాత అంతా సైలెంట్ అవుతారని అంతా భావించారు.

కాని అనూహ్యంగా రాజీనామాలు మొదలు అయ్యాయి.నాగబాబు మరియు ప్రకాష్ రాజ్ లు మా సభ్యత్వం రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఇలాంటి సంకుచిత భావాలు ఉన్న నటీ నటుల మద్య నేను ఉండాలని అనుకోవడం లేదు అంటూ నాగబాబు తన మా సభ్యత్వం ను రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.ఇక ప్రకాష్‌ రాజ్‌ కూడా తాను ఈ భాష వాడిని కాదు కనుక ఓడించారు.

Advertisement

అందుకే నేను మా సభ్యత్వం ను వదులుకుంటున్నాను అంటూ ప్రకటించాడు.వీరిద్దరితో పాటు అంతకు ముందు సీవీఎల్ కూడా తన మా సభ్యత్వంకు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

రాజీనామా లేఖను కూడా పంపించాడు.ఈ ముగ్గురు కూడా తమ మా సభ్యత్వంను వదులుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

కాని ఇప్పటి వరకు వీరి సభ్యత్వాల విషయమై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.మా కొత్త అధ్యక్షుడు విష్ణు బాధ్యతలు తీసుకున్నాడు.

కనుక ఆయన ఈ రాజీనామాలపై స్పందించాల్సి ఉంది.రాత పూర్వంగా రాజీనామా లేఖ లు విష్ణు కు అందితే ఖచ్చితం గా రాజీనామా ఆమోదిస్తాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కాని ఇప్పటి వరకు అలా అందాయా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తుంది.మా సభ్యులు మాత్రమే కాకుండా మొన్నటి ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ తరపున పోటీ చేసి గెలిచిన వారు కూడా తమ పదవుల కు రాజీనామా చేస్తామంటూ ప్రకటించారు.కనుక ఈ రాజీనామాల వ్యవహారం ఏంటో.

Advertisement

ఎప్పటి కి ఈ విషయం తెములుతుందో అంటూ చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు.

తాజా వార్తలు