మంట‌పంపై వ‌ధువును అవ‌మానించిన వ‌రుడు.. విడిపోవాలంటున్న నెటిజ‌న్లు..

ఈ మ‌ధ్య పెండ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి.

చాలా వ‌ర‌కు ఫ‌న్నీ ఇన్సిడెంట్లు జ‌రుగుతున్నా కొన్ని చోట్ల మాత్రం విషాద‌క‌ర ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి.

దీంతో చాలా వ‌ర‌కు బాధాక‌రంగానే ఫీల్ కావ‌డం కూడా చూస్తున్నాం.నిజానికి పెండ్లి అంటేనే వధువరులు ఇద్ద‌రూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ చేసుకోవాల్సిన వేడుక‌.

ఇద్దరూ కూడా ఒకరిపైఒకరు ఎంతో ప్రేమను చూపించుకుంటూ చూపించే సంతోసాన్ని ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.ఇంకొన్ని వేడుక‌ల్లో జ‌రుగుతున్న ఘ‌ట‌నలు చూస్తూ ఉంటే ఇలాంట‌ప్పుడు అస‌లు పెండ్లి చేసుకోవ‌డం దేనికి అనిపిస్తుంది.

ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే ఘ‌ట‌న కూడా ఇలాంటిదే.మ‌నం ఇక్క‌డ చూస్తున్న వీడియోలో పెళ్లి వేడుక క‌నిపిస్తోంది.

Advertisement

కాక‌గా ఇందులో మంట‌పంపై వరుడు ప్రవర్తించిన తీరు అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైరల్‌గా అవుతోంది.

అదేంటంటే వివాహ వేడుకలో అంద‌రూ బిజీగా ఉంటారు.ఇక స్టేజీ మీద వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ దండ‌లు మార్చుకునే కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది.

ఇక వ‌ధువు త‌న చేతిలో ఉన్న దండను వరుడి మెడలో వేసి కాబోయే భ‌ర్త వేసే దండ కోసం ఎదురు చూస్తున్న‌ట్టు అలా నిల్చోని చూస్తుంది.కాగా వరుడు మాత్రం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి దండ వేయకుండా దూరంగా జ‌రిగి త‌న‌కు ఇష్టం లేదని చెప్తున్న‌ట్టుగా దూరం నుంచే దండ‌ను ఆమె మెడ‌లోకి విస‌రి వేస్తాడు.కానీ ఆ దండ వ‌ధువు మెడ‌లో ప‌డ‌కుండా కింద ప‌డ‌టం కూడా మ‌న‌కు క‌నిపిస్తుంది.

దీంతో బందువు అంద‌రూ షాక్ అయిపోతారు.ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు వ‌రుడి చేష్ట‌లు బాగా లేవ‌ని కాబ‌ట్టి ఇప్పుడే విడిపోతే మంచిదంటూ వ‌ధువుకు సూచిస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు