చంద్రబాబు -పవన్ కళ్యాణ్ కలిసి పని చేయాలి అంటున్న టీడీపీ మాజీ మంత్రి..!!

ఆచంట నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల్లో టీడీపీ- జనసేన కలసి పనిచేయడం మంచి పరిణామమని అన్నారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రెండు పార్టీలు కలవాల్సిన పరిస్థితి ఉందని, ఆ దిశగా ఇప్పటికే ఆచంట నుండి టీడీపీ.

జనసేన పార్టీ కార్యకర్తలు కలిసి పని చేస్తున్నారని.పితాని పేర్కొన్నారు.

ఈ విషయంలో చంద్రబాబు .పవన్ కళ్యాణ్ కలిసి ఆలోచన చేయాలని సూచించారు.ఆచంట ఎంపీపీ పదవి టీడీపీ కైవసం చేసుకున్న సమయంలో మీడియాతో పితాని సత్యనారాయణ మాట్లాడిన టైం లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అధికార పార్టీ క్యాంపు రాజకీయాలు చేసినా  గాని.జనసేన పార్టీ టీడీపీ  కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో తీవ్రంగా కృషి చేశాయని పితాని స్పష్టం చేశారు.ఎవరి ప్రోద్బలం లేకుండానే జనసేన టీడీపీ కార్యకర్తలు గ్రామ స్థాయి నుండి ఈ రకంగా కలవడం.

Advertisement

బట్టి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా.ఇరు పార్టీ లకు చెందిన నాయకులు.

ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని పితాని సత్యనారాయణ సూచించారు.వాక్ స్వాతంత్రం.

భావ స్వాతంత్రం లేకుండా రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని ప్రతిపక్షాలకు గౌరవం లేకుండా అధికారపార్టీ చూస్తుంది అని పితాని సత్యనారాయణ విమర్శించారు.ఏది ఏమైనా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న పరిస్థితుల్లో ఆచంట నియోజకవర్గంలో టీడీపీ- జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు కలిసి ముందుకు రావడం ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవటం.

సంతోషించదగ్గ విషయం అని పేర్కొన్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు