ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మరోసారి ఏపీలో వైసీపీ కి ఎదురు లేదు అని అనిపించింది.ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం లో కూడా వైసీపీ గెలవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తెలుగుదేశం పార్టీ కీలక నాయకుల నియోజకవర్గాలలో చాలాచోట్ల వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు.ఈ సందర్భంగా గెలిచిన విజయం ఉద్దేశించి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు జగన్.ప్రజల అందరి చల్లని దీవెనలతో భగవంతుని దయతో పరిషత్ ఎన్నికల్లో.
గెలవడం జరిగిందని.స్పష్టం చేశారు.
ఎన్నికలలో ప్రజలిచ్చిన విజయం.మరింత బాధ్యతను పెంచేలా చేసిందని.
తెలిపారు.

ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దాదాపు అమలు చేశామని జగన్ చెప్పుకొచ్చారు.అందువల్లే ప్రజల దీవెనలతో పరిషత్ ఎన్నికల్లో కూడా విజయం సాధించామని ఈ ఫలితాలు ప్రతి కుటుంబం పై మనిషి పట్ల మరింత బాధ్యతను పెంచుతాయని జగన్ అన్నారు.81% పంచాయతీల్లో అదే రీతిలో 99% మున్సిపల్ ఎన్నికల్లో.వైసీపీ అభ్యర్థులు గెలవటం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు.ప్రతి ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఆదరించటం నిజంగా ఆనందంగా ఉందని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని.
చెప్పుకొచ్చారు.ప్రజలకు మంచి చేస్తుంటే కొన్ని మీడియా సంస్థలు ప్రతిపక్షాలు ఇబ్బందులపాలు చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు మేలు చేయడానికి ఏమాత్రం వెనుకాడబోమని జగన్ స్పష్టం చేశారు.